500 కూడా లేవు.. అప్పు తీర్చలేకపోయా, ఓ రోజున తలుపు గడియ పెట్టేసుకున్నా : పటాస్ ఫైమా

మేల్ కమెడియన్లదే రాజ్యమైన జబర్దస్త్‌లో ఫిమేల్ కమెడియన్లకు స్టార్ స్టేటస్ తెచ్చినవారిలో ఫైమా ఒకరు. పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఫైమా.. తన కామెడీ, టైమింగ్, చలాకీతనంతో తెలుగువారికి బాగా దగ్గరైంది. ఆ వెంటనే జబర్దస్త్ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులరైంది. ఆమె విసిరే పంచ్‌లకు నవ్వుల పువ్వులు గ్యారెంటీ. బుల్లితెరతో పాటు ఎన్నో షోలు, ఈవెంట్లలలో వరుస అవకాశాలు దక్కించు ుంటూ దూసుకెళ్లింది ఫైమా. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొనే ఛాన్స్ దక్కించుకుని గ్రాండ్ ఫినాలేకు ముందు వరకు వచ్చి 13వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది.

బుల్లితెరపై అందరు నటీనటుల మాదిరిగానే ఫైమా ప్రేమ, పెళ్లి అంటూ బోల్డెన్నీ గాసిప్ప్ మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పటాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచే తన కో స్టార్ ప్రవీణ్‌తో ఫైమా కాస్త క్లోజ్‌గా వుంటుంది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఫైమా తన ప్రతిభ, కష్టంతో ఇక్కడి వరకు వచ్చింది. తన తల్లికి సొంతింట్లో ఉండాలనే కల ఉందని బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు బయటపెట్టిన ఆమె గతేడాది తల్లి కోరిక నెరవేర్చింది.

Jabardasth faima sensational comments on her entry into patas comedy show

తను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టించి తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చింది. గతేడాది కొత్తింట్లో గృహ ప్రవే ం కూడా చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి సంబరపడిపోయింది . జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్‌తో పాటు మరికొందరు నటీనటులు వచ్చి ఫైమాకు శుభాకాంక్షలు తెలిపారు. బుల్లితెరపైకి ఫైమా ఎంట్రీ ఆశ్చర్యకరంగానే జరిగింది. ఏదో షో చూద్దామని వస్తే.. ఆమె చలాకీతనం, పంచ్‌లకు ముచ్చటపడిన నిర్వాహకులు ఏకంగా ఆ షోలో పార్టిసిపెట్ చేసే అవకాశం కల్ప ంచారట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను పటాస్ షోకు వెళ్లే వరకు మా ఇంట్లో కనీసం టీవీ కూడా లేదని.. ఆ షో నిర్వాహకులు కొంతమంది కాలేజీ స్టూడెంట్స్‌ని ఆడియన్స్ కింద తీసుకురమ్మని నేను చదివే కాలేజ్ వాళ్లకి చెప్పారని ఫైమా తెలిపింది. అప్పుడు ఒక్కొక్క స్టూడెంట్‌కు రూ.500 చొప్పున వసూలు చేసి పిక్నిక్‌లాగా ఆ షోకు తీసుకెళ్లారని.. అయితే సమయంలో రూ.500 కూడా నా వద్ద లేవని , మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పింది. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నా.. నేటికీ మా ఫ్రెండ్ అప్పు తీర్చలేదని ఫైమా అన్నారు.

తన అల్లరి, చలాకీతనం, జోకులు చూసి పటాస్ నిర్వాహకులు తనకు స్టాండప్ కమెడియన్‌గా అవకాశం ఇచ్చారని ఈ విషయాన్ని ఇంట్లో చెబితే అమ్మ వద్దు అని తేల్చేసిందన్నారు. సింగిల్ ప్రోమోకే ఇంత హైప్ వచ్చిందంటే ఫ్యూచర్‌లో ఉపయోగప ుతుందని అమ్మను ఒప్పించే ప్రయత్నం చేశానని.. కానీ ఆమె మాత్రం హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు, ఆడపిల్లవి వద్దు అని చెప్పింది ఫైమా తెలిపారు.

దీంతో అలిగి రెండు రోజులు అన్నం తినలేదని.. పేరెంట్స్ ముందు తినలేదు, వాళ్లు బయటికి వెళ్లినప్పుడు తినేదాన్నని సరదాగా చెప్పింది. మా నాన్నకు నేనంటే పంచ ప్రాణాలని.. ఏడిస్తే అస్సలు తట్టుకోలేడని, ఆయన వేరే కంట్రీలో ఉండేవారని తెలిపింది. పటాస్ షోక వెళ్తానంటే నాన్న కూడా ఒప్పుకోలేదని.. దీంతో ఓ రోజున రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టేసుకుని చచ్చిపోతానని బెదిరించడంతో అమ్మ భయపడి ఒప్పుకుందని ఫైమా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X