హైపర్ ఆది అలా మెసేజ్ చేశాడు.. తలుపు తీసి చూడగానే షాకయ్యా: తొలిసారి బయటపెట్టిన అదిరే అభి
కామెడీ ప్రధానంగా ప్రారంభమై.. చాలా తక్కువ సమయంలోనే సూపర్ హిట్ అయిన షోనే జబర్ధస్త్. సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తోన్న ఇది.. మంచి రేటింగ్‌ను రాబడుతూ దూసుకుపోతోంది. దీని ద్వారా ఎంతో మంది ప్రపంచానికి పరిచయం అవడంతో పాటు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో అదిరే అభి ఒకడు. తనదైన హాస్యంతో మెస్మరైజ్ చేసిన అతడు.. వరుసగా ఆఫర్లను అందుకున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం పెద్దగా సందడి చేయడం లేదు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదిపై అదిరే అభి తాజాగా కామెంట్లు చేశాడు. ఆ వివరాలు మీరే చూడండి!
యాంకర్ నుంచి షోలోకి
అదిరే అభి నటుడిగా కెరీర్‌ను మొదలు పెట్టేశాడు. అలా చాలా సినిమాల్లో నటించాడు. అలాగే బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటాడు. అలా మంచి పేరు సంపాదించాడు. కానీ, జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం అతడు బాగా పాపులర్ అయిపోయాడు. సాధారణ కమెడియన్ నుంచి టీమ్‌కు లీడర్‌గా మారిన అభి.. ఎన్నో సంవత్సరాల పాటు అందులో అలరించాడు.

టీమ్ లీడర్‌గా పాపులర్
'జబర్థస్' షోలో అదిరే అభి ఓ టీమ్‌కు లీడర్‌గా చాలా కాలం పాటు కొనసాగాడు. ఈ క్రమంలోనే బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది కళాకారులను బుల్లితెరపైకి తీసుకు వచ్చాడు. ఇప్పుడు పెద్ద సెలెబ్రిటీగా మారిపోయిన 'హైపర్ ఆది'ని కూడా పరిచయం చేసింది అతడే అని చాలా మందికి తెలీదు. ఇలా కూడా అదిరే అభికి మంచి పేరు లభించింది.
జబర్ధస్త్ షోకు దూరంగా
సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా, టీమ్ లీడర్‌గా హవాను చూపించిన అదిరే అభి.. కొద్ది రోజుల క్రితమే ఆ షో నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో అదిరే అభిని అభిమానించే వాళ్లంతా డల్ అయిపోయారు. అయితే, అతడు సినిమాలపై ఫోకస్ చేయడం కోసమే ఇలా తప్పుకున్నాడని తెలిసింది.

హైపర్ ఆదితో గొడవలే
జబర్ధస్త్ షోలో ఉన్న టాప్ కమెడియన్లలో హైపర్ ఆది ఒకడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అతడిని పరిచయం చేసిన ఘనత అదిరే అభిదే అని తెలిసిందే. ఇలా వీళ్లిద్దరూ గురు శిష్యుల్లా ఉండేవారు. అయితే, కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని ఇద్దరూ ఖండించినా ఈ పుకార్లకు మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు.
అలా మెసేజ్ పెట్టాడు
అదిరే అభి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో అతడు మాట్లాడుతూ.. 'ఆది ఒకసారి ఫేస్‌బుక్‌లో నేను షార్ట్ ఫిలిం చేశా చూడండి అని మెసేజ్ పెట్టాడు. తర్వాత అది చూసి బాగుంది అని రిప్లై ఇచ్చాను. అంతేకాదు నన్ను కలువు కలిసి పని చేద్దాం అని అన్నాను. దీంతో వెంటనే అన్నపూర్ణ స్టూడియోకు వచ్చేశాడు. అలా ఆది నాకు పరిచయం అయ్యాడు' అన్నాడు.

తలుపు తీసి షాకయ్యా
అభి కంటిన్యూ చేస్తూ.. 'మేము రూమ్‌లో స్కిట్లు ప్రాక్టీస్ చేస్తుంటే ఆది బయట ఉండి నవ్వేవాడు. ఒకసారి అతడు నవ్వుతుంటే తలుపు తీసి చూసి షాకయ్యా. వెంటనే లోపలికి రమ్మన్నాను. అప్పటి నుంచి నాకు కొన్ని సలహాలు ఇచ్చేవాడు. తర్వాత కొన్ని పాయింట్లు యాడ్ చేసేవాడు. అనంతరం ఫుల్ స్కిట్ రాసేవాడు. అలా పర్‌ఫెక్ట్ అయిపోయాడు' అంటూ వివరించాడు.


Click it and Unblock the Notifications











