డైరెక్టర్‌గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. ఇంతకీ ఆ మూవీ ఏంటి?
ప్రముఖ బుల్లితెర ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు.. ఎంతోమంది కళాకారులను గుర్తించింది. ఈ షో ఫేమ్ తో కొంతమంది నటులు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. అందులో కొందరు స్టార్ కమెడియన్స్ గా రాణిస్తే.. మరికొందరు హీరోలుగా, డైరెక్టర్లు మారారు. మరి కొందరు ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలు కూడా తీస్తున్న విషయం తెలిసింది. అలా తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్.. డైరెక్టర్ గా మారి.. టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరు? ఆయనే డైరెక్ట్ చేస్తున్న సినిమా ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలపై మీరు కూడా ఓ లూక్కేయండి.
జబర్దస్త్ షో అనగానే గుర్తుకొచ్చేది అనసూయ.. ఈ షోతో అనసూయ ఎంతో పాపులర్ అయ్యింది. తన చెలాకీ మాటలు, అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్థస్ ఫేమ్ తోనే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అనసూయ. పలు సినిమాలలో నటించే అవకాశం కొట్టేసింది. తన నటనతో సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ కమ్ నటి. అనసూయ తన కెరీర్లో రంగస్థలం, పుష్ప, పుష్ప 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. .

ఇదే షో నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వేణు వెల్దండి.. 'బలగం' అనే మూవీతో డైరెక్టర్‌గా మారి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు వేణు వెల్దండి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు తీసే స్తాయికి ఎదిగారు. స్టార్ హీరో నాని తో ఎల్లమ్మ అనే సినిమా తీయబోతున్నారు. అలాగే.. జబర్ధస్థ్ కంటెస్టెంట్ ధన్‌రాజ్ అంతకుముందు పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఇటీవలే రామం రాఘవం మూవీతో దర్శకుడిగా మారబోతున్నాడు. ఇక రాంకింగ్ రాకేష్ ఏకంగా కేసీఆర్ అనే సినిమాకు ప్రోడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా మరో జబర్ధస్థ్ కమెడియన్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. అతడే.. 'అదిరే అభి' (Adhire Abhi). దీపావళి పండగ నాడు తాను డైరెక్టర్ గా మారుతున్ననంటూ.. పోస్టర్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా పేరును కూడా ఖరారు చేశారు అదిరే అభి. అభి తన డెబ్యూ మూవీకి 'చిరంజీవ' (CHIRANJEEVA)పేరు పెట్టారు. ఈ మైథలాజికల్ కంటెంట్ లో యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నారు. అయితే... ఇది సినిమాగా కాకుండా.. ఓటీటీలో మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీలో డిసెంబర్‌లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ ను ఎ రాహుల్ యాదవ్ , సుహాసిని రాహుల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిరంజీవ వెబ్ సిరీస్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు జబర్దస్త్ షోలో స్టార్ కమెడియన్ గా అలరించిన అదిరే అభి.. డైరెక్టర్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తన కామెడీ స్కిట్స్ తో ఎంతగానో అలరించిన అభి.. ఎలాంటి కంటెంట్ ను తెరకెక్కించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ స్టార్ కమెడియన్ కం డైరెక్టర్ కు.. పలువురు సెలబ్రిటీలు ఆల్ ది బెస్ట్ చెప్తూ విషెస్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











