ఇద్దరు పిల్లల తల్లినైతే ఏంటీ? బోల్డ్‌గానే ఉంటా.. ఇచ్చిపడేసిన అనసూయ
అనసూయ భరద్వాజ్.. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్‌గా ఎదిగింది. హీరో, హీరోయిన్ల రేంజ్‌లో పాపులారిటీతో దూసుకెళ్తున్నారు అనసూయ. సినిమాలు, షోలు, ఈవెంట్స్‌ను మించి వివాదాలతోనే నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన డ్రెస్సింగ్ స్టైల్, ఆంటీ అంటూ ఎవరైనా విమర్శించినా ఒంటి కాలు మీద లేస్తుంది అనసూయ. తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఇచ్చిపడేసింది ఈ స్టార్ యాంకర్. ఈ వివరాల్లోకి వెళితే..
40 ఏళ్ల వయసులోనూ తరగని అందం
జబర్దస్త్ కామెడీ షోతో తెలుగునాట పాపులరైన అనసూయ భరద్వాజ్.. తన అంద చందాలతో హీరోయిన్లను మించిన స్టార్ డమ్ సంపాదించింది. 40 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకు సెగలు రేపుతుంది. హాట్ హాట్ ఫోటో షూట్‌లు, రెచ్చగొట్టే ఔట్‌ఫిట్స్‌తో కుమ్మేస్తుంది. ఇదే ఇప్పుడు అనసూయకి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తన డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్లు చేసే కామెంట్స్‌కు రియాక్ట్ అవుతూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది.

30 లక్షల మందిని బ్లాక్ చేశా
తన గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టినవారిపై గతంలో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆమెను నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ ఈ ట్రోలింగ్‌పై మాట్లాడింది. తన గురించి అడ్డదిడ్డంగా కామెంట్స్ చేసేవారిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని .. ఇలా దాదాపు 3 మిలియన్లు (30 లక్షల మంది)ని బ్లాక్ చేశానని షాకింగ్ న్యూస్ చెప్పింది. దీంతో అనసూయపై తీవ్రంగా విరుచుకుపడ్డారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో మరోసారి రంగమ్మత్త ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
నా గురించి ఏం తెలుసు
తనపై కామెంట్ చేస్తున్నా మౌనంగానే ఉంటున్నానని.. కానీ నా జీవితం, లైఫ్‌స్టైల్‌పై విమర్శలు చేస్తుంటే స్పందించాల్సి వస్తుందన్నారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో నా గురించి అసత్య ప్రచారం జరుగుతోందని.. మహిళలు కూడా నన్నే విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారని అనసూయ తెలిపారు. వాళ్లు నాకు తెలియదు.. నేనెవరో వాళ్లకు తెలియదు అయినప్పటికీ నేను ధరించే దుస్తులపై కామెంట్ చేస్తున్నారని అనసూయ మండిపడ్డారు.
నా భర్తే అడగడు
నేను ఒక మహిళని, ఇల్లాలిని, ఇద్దరు పిల్లలకు తల్లిని.. నాకు ఎలాంటి బట్టలు నప్పుతాయో వాటిని ధరించడాన్ని ఇష్టపడతానని అనసూయ స్పష్టం చేశారు. నేను ఓ మాతృమూర్తిగా ప్రవర్తించడం లేదని కొందరు విమర్శిస్తున్నారని.. తల్లి అంటే మనల్ని మనం వదిలేసుకోవడమా? అని ఆమె ప్రశ్నించారు. నచ్చిన దుస్తులు ధరిస్తున్నానంటే నా విలువలను కోల్పోయానని కాదు.. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్లు కాదని అనసూయ పేర్కొన్నారు. నా భర్త, నా పిల్లలు నన్ను అర్ధం చేసుకున్నారు, ప్రేమిస్తున్నారు.. అండగా నిలుస్తున్నారని చెప్పింది. తనను స్పూర్తిగా తీసుకుని బతకమని నేను చెప్పడం లేదు.. నాకు నచ్చినట్లు నేను జీవిస్తున్నాను, మీకు ఎలా కావాలనుకుంటే అలా బతకండి అని సూచించింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











