Jabardasth రచ్చ రవి.. బ్రహ్మానందం గారి వల్లనే సొంత ఇల్లు.. డబ్బుల విషయంలో ఆయన ఏమన్నారంటే..

జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న రచ్చ రవి ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాలు చెప్పాడు. అంతే కాకుండా రచ్చ రవికి కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక సహాయం చేసిన విషయం గురించి చెబుతూ ఆయన వల్లనే తొందరగా సొంతింటి కల నిజమైంది అని ఇక ఆయన డబ్బుల విషయంలో చెప్పిన మాటల గురించి కూడా వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ ద్వారానే

జబర్దస్త్ ద్వారానే

జబర్దస్త్ లో మొదట రచ్చ రవి ఇతర టీమ్ సభ్యులతో కమెడియన్ గా చేరాడు. ఎక్కువగా చమ్మక్ చంద్ర టీమ్ లో కొనసాగిన రవి అనంతరం రచ్చ రవి అనే టీమ్ తో లీడర్ గా కూడా కొనసాగారు. ఇక చాలా రోజుల వరకు రవి తన టీమ్ సభ్యులతో జబర్దస్త్ లోనే కొనసాగుతూ వచ్చాడు. జబర్దస్త్ ద్వారానే రవి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.

 బయటకు రావడం వలన

బయటకు రావడం వలన

అయితే రచ్చరవి జబర్దస్త్ నుంచి బయటకు రావడం వలన అతనిపై కూడా చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. కొంతమంది సీనియర్ కమెడియన్స్ ఎలాగైతే గొడవలు పడుతూ బయటకు వచ్చారో అలాగే రవి కూడా మల్లెమాల వారితో విబేధాలు వచ్చి బయటకు వచ్చాడని కామెంట్స్ కూడా వినిపించాయి.

ఆ కారణం వల్లనే

ఆ కారణం వల్లనే

ఇక రచ్చరవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. జబర్దస్త్ మనేయ్యడానికి గల కారణాన్ని కూడా తెలియజేశాడు. నిజానికి జబర్దస్త్ నాకు తల్లి లాంటిది అంటూ సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పటికీ డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేకపోయాను అని ఆ కారణం వల్లనే జబర్దస్త్ మానేసి సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టాను అని అన్నాడు.

ఆ ఛాన్స్ లేదు

ఆ ఛాన్స్ లేదు

ఇక జబర్దస్త్ మనేసినప్పటికి కూడా అప్పుడప్పుడు వివిధ షోల కోసం పిలిచినప్పుడు వెళ్ళాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వెళుతూనే ఉన్నాను. మల్లెమాల నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా కూడా వెళ్తాను కానీ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉండడం వలన కొన్నిసార్లు కుదరకపోవచ్చు అని అన్నారు. అలాగే జబర్దస్త్ లో రెగ్యులర్ గా మాత్రం కొనసాగే ఛాన్స్ లేదని రెండు పడవల మీద ప్రయాణం అంత సులువు కాదని రవి అన్నాడు.

బ్రహ్మానందం గారి వలన సొంతింల్లు

బ్రహ్మానందం గారి వలన సొంతింల్లు

ఇక ఆర్ధికంగా సినిమాల్లోకి వచ్చిన తరువాతనే స్థిరపడ్డాను అంటూ రచ్చరవి తన సొంతింటి కల విషయంలో బ్రహ్మానందం గారు కూడా ఒక కారణం అయ్యారని అన్నారు. టీవీలోనే కొన్నిసార్లు ఆయన కామెడీ చూసి నన్ను ప్రత్యేకంగా పిలుచుకొని మరి మాట్లాడారు. చాలా ప్రశంసించారు. అయితే ఒకేసారి బ్రహ్మానందం గారు ఫోన్ చేసి వెంటనే ఒక ఇల్లు కొనుక్కోవాలని స్వయంగా ఫ్లాట్ చూపించినట్లు రవి చెప్పాడు.

 డబ్బుల విషయంలో..

డబ్బుల విషయంలో..

5 లక్షలు తక్కువైనా పర్వాలేదు అని నేను ఇస్తాను అని వెంటనే ప్లాట్ కొనుక్కో అని బ్రహ్మానందం గారు అన్నప్పుడు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నా జీవితంలో ఎవరి దగ్గర అప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇక ఆయన నా ఇంటి గృహప్రవేశంకు కూడా వచ్చారు. ఆయన నా కుటుంబ సభ్యులందరికి ప్రత్యేకంగా ప్రతీ ఒక్కరికీ ఫొటోలకు స్టిల్ కూడా ఇచ్చారు అని రవి ఆనందంగా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X