లేడీస్ హాస్టల్‌‌లో తలదాచుకున్నా... ఫస్ట్ స్కిట్‌లోనే అలాంటి అవమానం.. హైపర్ ఆది ఎమోషనల్

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హైపర్ ఆది. తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బుల్లితెర నుంచి వెండితెర మీదకి అడుగుపెట్టారు ఆది. ప్రస్తుతం సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్, ఇతర కార్యక్రమాలతో ఆది బిజీగా ఉంటున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినా వేరే కార్యక్రమాలతో నవ్విస్తున్నాడు ఆది. అయితే ఇదంతా రాత్రికి రాత్రి వచ్చేయలేదు.. దీని వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది తన ప్రస్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

బుల్లితెర నుంచి వెండితెర మీదకి
ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన హైపర్ ఆది.. చదువులో మెరిట్ స్టూడెంట్. బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే నటనపై తొలి నుంచి ఆసక్తి ఉండటంతో తన మిత్రులతో కలిసి ఫేస్‌బుక్‌లో చిన్న చిన్న రీల్స్ చేస్తూ అదిరే అభి దృష్టిలో పడ్డాడు. అలా జబర్దస్త్‌లో అవకాశం అందుకుని.. తొలుత చిన్నా చితకా పాత్రలు చేస్తూ ఆ తర్వాత రైటర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్‌లో వచ్చిన ఫేమ్‌తో సినిమాలలో ఆయనకు అవకాశాలు వచ్చాయి. అలా వెండితెర, బుల్లితెరపై తన హవా సాగిస్తున్నాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఆది ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Jabardasth Fame Hyper Aadi reveals his Struggles and Inspiring Journey

క్లాస్‌లో కంటే బయటే ఎక్కువ
బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. 100 రూపాయలు కావాలన్నా పక్కింటి వైపు చూడాల్సిందే. ఇద్దరు అన్నయ్యల చదువు పూర్తయ్యాక ఖాళీగానే ఉన్నారు. ఈ దశలో నాకు ఉద్యోగం రావడంతో కుటుంబం మొత్తం నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకచోటే కూర్చోవాలంటే నా వల్ల అయ్యే పనికాదు.. ఒకటే ఏదో ఒకటి చేయడం ఇష్టం ఉండదు. ఏదో కొత్తగా చేయాలి.. కాలేజీ రోజుల్లో వెనుక బెంచ్‌లలో కూర్చోనీ మాస్టర్ల మీద కౌంటర్లు వేయడం, ఎవరో ఒకరిని గిల్లడం ఇలా చేసేవాడిని. క్లాస్‌లో కంటే బయటే ఎక్కువగా నిలబడ్డాను. ఉద్యోగం వచ్చాక శని, ఆదివారాలైనా ఏదో ఒకటి చేద్దామని కృష్ణకాంత్ పార్క్ వెళ్లేవాడిని.. మా ఫ్రెండ్ ఫోన్‌లో వీడియో తీస్తుండగా నేను సినిమాలో ఏదో ఒక సీన్‌ని స్పూఫ్‌లా చేసేవాడిని. అలా అత్తారింటికి దారేది క్లైమాక్స్ చేయగా అది అభి అన్న చూశాడు. ఒకసారి స్టూడియో దగ్గరికి రమ్మని కబురు చేశాడని ఆది గుర్తుచేసుకున్నారు.

అప్పు తీర్చడం కోసం పొలం అమ్మేశా
నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లోనే జబర్దస్త్ మంచి పీక్స్‌లో ఉంది. చమ్మక్ చంద్ర, వేణు, రాఘవ వంటి వారి స్కిట్లను మేం ల్యాప్‌టాప్‌లో చూసి ఎంజాయ్ చేసేవాళ్లం. జబర్దస్త్ సెట్‌కి రాగానే.. నన్ను స్కిట్లు రాయమన్నారు, నాకేమో స్కిట్స్ చేయాలని ఆశ. ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడిందన్న ఫీలింగ్‌లో నుంచి నేను బయటకు రావడం ఆషామాషీ కాదు. అప్పటికే 20 లక్షల అప్పుంది.. ముగ్గురిని చదివించడానికి, వేరే కారణాలు, పొలం సరిగా పండకపోవడంతో చాలా నష్టం వచ్చింది. ఆ అప్పు నా మైండ్‌లో ఉండకూడదనే ఉద్దేశంతో ఉన్న మూడెకరాలను అమ్మించేశాను. ఎలాగైనా పోయిన దానిని తిరిగి సంపాదించాలనే తపనతో ఎంతో కష్టపడ్డాను. అమీర్‌పేట హాస్టల్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు రోజూ నడిచి వెళ్లేవాడిని అని ఆది తెలిపారు.

లేడీస్ హాస్టల్‌లోనే బస
అమీర్‌పేటలోని హాస్టల్ మా బంధువులదే. కానీ అది ఓ లేడీస్ హాస్టల్.. పైన లేడీస్ ఉండేవారు, మా బంధువులు ఓ రూమ్‌లో, నేను ఇంకో రూమ్‌లో ఉండేవాడిని. అలా ఏడాదిన్నర పాటు ఉన్నా. లేడీస్ భోజనం చేయాలంటే కింద మెస్‌లోకి రావాలి, నేను రూమ్‌లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. వాళ్లు పొద్దున్నే లేచే టైంకి నేను బయటకు వచ్చేవాడిని, నైట్ వాళ్ల మెస్ అయిపోయాక రూమ్‌కి వచ్చేవాడిని. వాళ్లకు ఎంతో కొంత ఇచ్చేవాడిని, ఊరకే ఉండాలంటే నా మనసు ఒప్పుకునేది కాదు. ఏడాది తర్వాత పంజాగుట్టలోని రూమ్‌కి షిఫ్ట్ అయ్యా. ఆ తర్వాత పీక్స్‌లోకి వెళ్లిపోయా.. ఆ రూమ్ నాకు బాగా కలిసొచ్చి, ఇప్పటికీ అదే రూమ్‌లో ఉంటున్నా అని ఆది తెలిపారు.

ఫస్ట్ స్కిట్‌లోనే నా పరువు పోయింది
అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లే టైంకి కొన్ని వందల మంది ఉన్నారు. ఒక్కసారైనా స్టేజ్ ఎక్కిస్తే చాలని అనుకునేవారు ఎందరో. అప్పటికే ఆరుగురు టీమ్ లీడర్లు, వాళ్ల కింద కంటెస్టెంట్స్.. ఒక్కో టీమ్‌లో ఆరు నుంచి ఏడుగురు ఉండేవారు. వాళ్లను దాటుకుని ప్లేస్‌ సంపాదించాలంటే నా ముందున్న ఆప్షన్ రాయడం ఒక్కటే. జబర్దస్త్‌లో నా జర్నీ శాడెస్ట్ మూవ్‌మెంట్‌తోనే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించినప్పుడు భీమవరం బుల్లోడు సినిమా ప్రమోషన్స్ కోసం సునీల్ గారు జబర్దస్త్‌కి వచ్చారు. సునీల్ రిక్షాలో ఉంటాడు.. ఆయనను లాక్కుని రావడమే నా ఫస్ట్ స్కిట్. రిక్షా లాగే గెటప్‌లో ఉన్న ఫోటోని ఫేస్‌బుక్‌లో పెట్టి ఈరోజు జబర్దస్త్‌లో రాబోతున్నానని చెప్పా. దాంతో నా ఫ్రెండ్స్, బంధువులు అందరూ మెసేజ్‌లు చేశారు. తీరా స్కిట్ చూస్తే.. దానిని ఆపి చూస్తేనే కానీ నేను అని తెలియదు. నువ్వు జబర్దస్త్‌లో ఉన్నాను అన్నావు.. ఎక్కడ అని మా వాళ్లు అడగ్గా నా పరువు పోయినట్లు అనిపించింది. అనవసరంగా ఫోటో పెట్టాను, ఏదైనా మాట్లాడి పెడితే బాగుండు అనిపించింది అని హైపర్ ఆది తన జీవితంలోని కష్టాలను చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Read more about: jabardasth hyper aadi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X