మా నాన్న రైతు, పంటల్లేక కూలీగా, జబర్దస్త్ మా కష్టాలు తీర్చింది: నెమలి రాజు

బజర్దస్త్ రాకింగ్ రాకేష్ టీంలో ఇద్దరు మరుగుజ్జు కళాకారులు నరేష్, నెమలి రాజు కలిసి పండించే కామెడీకి మంచి ఆదరణ లభిస్తోంది. నెమలి రాజు ఈ మధ్యనే జబర్దస్త్‌లోకి వచ్చి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయ్యాడు. తాజాగా నెమలి రాజుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమ కుటుంబం తీవ్రమైన కష్టాలు పడుతున్న సమయంలో తనకు జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందని, ఈ షో ద్వారా వచ్చే ఆదాయంతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని నెమలి రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా తమ కుటుంబం పరిస్థితి ఇంతకు ముందు ఎలా ఉండేదో వెల్లడించారు.

మా నాన్న రైతు, పంటల్లేక కూలీగా...

మా నాన్న రైతు, పంటల్లేక కూలీగా...

ప్రకాషం జిల్లా పొదిలి ప్రాంతానికి చెందిన నెమలి రాజు మాట్లాడుతూ... మా ఊర్లో మాకు కొంత పొలం ఉంది. నాన్న వ్యవసాయం చేసేవారు. అయితే వర్షాలు లేక పంటలు పండక ఇల్లు గడవటమే కష్టంగా ఉండేది. దీంతో నాన్న విజయవాడ వచ్చి కూలీగా మారాడు అని నెమలి రాజు తెలిపారు.

ఆయన వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది

ఆయన వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది

ఓ సారి ఢీ జోడీ షూటింగ్ జరుగుతుండగా చూడటానికి వెళ్లినపుడు పటాస్, జబర్దస్త్ రైటర్ రాజు నన్ను చూసి ‘జబర్దస్త్' చేస్తావా? అని అడిగారు. చేస్తాను అని చెప్పడంతో నన్ను తీసుకెళ్లి కొన్ని రిహార్సల్ చేయించారు. వారికి నచ్చడంతో నన్ను ఈ షోలో తీసుకున్నారని నెమలి రాజు తెలిపారు.

ఇప్పుడు సెటిలయ్యాను, మా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాను

ఇప్పుడు సెటిలయ్యాను, మా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాను

జబర్దస్త్ షో వల్ల నేను సెటిలయ్యాను. మా ఇంట్లో ఆర్థిక పరమైన కష్టాలు తీరాయి. కుటుంబాన్ని ఇపుడు బాగా చూసుకుంటున్నాను. ఎంతో గర్వంగా ఉంది. ప్రేక్షకులకు ఇలాగే వినోదం పంచుతూ, వారిని మరింత బాగా నవ్వించే ప్రయత్నం చేస్తాను అని నెమలి రాజు వెల్లడించారు.

ఊరికి మంచి పేరు తెస్తున్నావంటున్నారు

ఊరికి మంచి పేరు తెస్తున్నావంటున్నారు

ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నావని అంటున్నారు. మా ఊరి వాళ్లు కూడా చాలా మంది పొగుడుతున్నారు. ఊరికి మంచి పేరు తెస్తున్నావని అంటుండటం చాలా ఆనందంగా ఉంది అని నెమలి రాజు తలిపారు.

నెమలి రాజుపై నెటిజన్ల కామెంట్

నెమలి రాజుపై నెటిజన్ల కామెంట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నెమలి రాజు వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జబర్దస్త్ అనే మర్రి చెట్టు చాలా మందికి నీడను ఇచ్చింది, నెమలి రాజుకు మంచి ఫ్యూచర్ ఉండాలి అంటూ విష్ చేస్తున్నారు. ఎవడబ్బ సొత్తు కాదు రా టాలెంటు.. కీప్ ఇట్ అప్ నెమలి రాజు అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X