Bigg Boss Telugu 5 Week 13 Elimination: బిగ్‌బాస్ నుంచి గ్లామరస్ కంటెస్టెంట్ అవుట్.. టాప్ 5‌ ఆశలు గల్లంతు!

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో 13వ వారం ఎలిమినేషన్‌లో ఊహించినట్టే జరిగింది. ఈ వారం కీలకంగా మారడంతో సిరి హన్మంతు, ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్‌లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే ఊహగానాలు, సర్వేలు వెల్లడించాయి. అయితే 13వ వారం ఎలిమినేషన్‌తో టాప్ 5 జాబితాపై ఓ క్లారిటీ స్పష్టంగా వచ్చినట్టు కనిపిస్తున్నది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయంలోకి వెళ్లితే..

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh Unstoppable | VJ Sunny Rampage | Filmibeat Telugu
 నామినేషన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

నామినేషన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో టాప్ 5 లిస్టులో ఎవరు ఉంటారనే విషయంపై భారీగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ తప్ప మిగిలిన వారంతా నామినేట్ అయ్యారు. ప్రస్తుత వారంలో సిరి హన్మంతు, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, మానస్, సింగర్ రామచంద్ర నామినేషన్‌లోకి వెళ్లారు. దాంతో టాప్ కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై రకరకాల విశ్లేషణలు సోషల్ మీడియాలో కనిపించాయి.

 డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు అంటూ

డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు అంటూ

అయితే బిగ్‌బాస్ తెలుగు 5లో 13వ ఎలిమినేషన్‌పై ప్రైవేట్ సర్వేలు, విశ్లేషణలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఎలిమినేషన్ ముప్పు ఉన్న వారిలో ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్, సిరి హన్మంతు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయాన్ని తమ విశ్లేషణల్లో వివరించారు. అయితే డిస్నీ హాట్ స్టార్ యాప్‌ ఓటింగ్ విషయంలో ప్రతీ రోజు ఊగిసలాట కనిపించింది. చివరకు మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారుతుందనే విషయాన్ని విశ్లేషకులు వెల్లడించారు.

ఎలిమినేట్ అయిన వారు ఎవరంటే..

ఎలిమినేట్ అయిన వారు ఎవరంటే..

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో ఇప్పటి వరకు 12 మంది ఎలిమినేట్ అయ్యారు. తొలివారం 7 ఆర్ట్స్ సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహిరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరోవారం శ్వేతా వర్మ,, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదో వారం జస్వంత్ పడాల, 11వ వారం అనీ మాస్టర్, 12వ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. అయితే యాంకర్ రవి ఎలిమినేషన్ వివాదాస్పదంగా మారింది.

 13వ వారంలో ప్రియాంక సింగ్ అవుట్

13వ వారంలో ప్రియాంక సింగ్ అవుట్

ప్రస్తుత వారంలో అంటే 13వ వారంలో ప్రియాంక సింగ్ అలియాస్ ప్రియాంక అలియాస్ పింకి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో సిరి హన్మంతు, ప్రియాంక సింగ్ పోటాపోటిగా ఓట్లు తెచ్చుకొన్నారు. మిస్డ్ కాల్ డేటా ఆధారంగా తక్కువ ఓట్లు పోలైన ప్రియాంకను ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. అయితే ప్రియాంక గేమ్ పరంగా ఆకట్టుకోలేకపోయినా.. తన గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాకుండా తన బిహేవియర్‌తో ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నారు.

టాప్ 5లో ఆ ఐదుగురు అంటూ

టాప్ 5లో ఆ ఐదుగురు అంటూ

ఇక ప్రియాంక సింగ్ ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ టాప్ 5 జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీరామచంద్ర ఫినాలె టికెట్‌తో ఇప్పటికే ఫైనల్‌లో చేరారు. ఇక నాలుగు స్థానాలకు సన్నీ, షణ్ముఖ్, సిరి హన్మంతు, ఆర్జే కాజల్, మానస్ పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌, ఓటింగ్‌ను బట్టి సన్నీ, షణ్ముఖ్ టాప్ 5లో చేరడానికి అవకాశం ఉంది. అయితే మానస్, సిరి హన్మంతు, ఆర్జే కాజల్‌లో ఇద్దరు టాప్ 5లో చేరే ఛాన్స్ కనబడుతున్నాయి.

డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్ ఫినాలే

డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్ ఫినాలే

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నది. డిసెంబర్ 19వ తేదీన జరిగే ఫైనల్ ఈవెంట్ ఎపిసోడ్‌లో విజేత ఎవరో తెలియడం ఖాయం. ఐదో సీజన్‌లో షణ్ముఖ్ లేదా వీజ సన్నీలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారనే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే షణ్ముఖ్, వీజే సన్నీలకు ఎవరైనా పోటికి వస్తారా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X