జబర్ధస్త్ ప్రియాంక అందాల అరాచకం: శృతి మించిన షోతో రెచ్చగొడుతోందిగా!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు విపరీతంగా సందడి చేస్తున్నారు. అలాగే, కొందరు ట్రాన్స్‌జెండర్లు కూడా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్‌లు వేసుకుంటూ కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తర్వాత లింగ మార్పిడి చేసుకుని హైలైట్ అయింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఎంట్రీ తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
సాయితేజ నుంచి ప్రియాంక:సాయి తేజ జబర్ధస్త్ షోలో సందడి చేసి.. ఎన్నో స్కిట్లలో లేడీ గెటప్‌లతో ఆకట్టుకున్నాడు. తద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. ఇక, ఈ ఆపరేషన్ తర్వాత ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో కష్టాలను కూడా అనుభవించింది. దీంతో చాలా కాలం గ్యాప్ తీసుకుంది.

బిగ్ బాస్ ఎంట్రీతో మరింత:సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రియాంక సింగ్‌కు పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయింది. ఈ పరిస్థితుల్లోనే ఆమెకు బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. అప్పుడు మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆమె మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. తద్వారా మరింత హైలైట్ అయింది.
లవ్ ట్రాక్‌తో... ఎలిమినేషన్:బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రియాంక సింగ్ యమా హైలైట్ అయింది. కట్టు బొట్టు విషయంలో అమ్మాయిల కంటే పద్దతిగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన రీతిలో అలరించింది. కానీ ఫినాలే ముందే ఎలిమినేట్ అయిపోయింది.

ఆ సినిమా.. ఆఫర్లు తక్కువే:బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సింగ్ క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో లభించాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమాను ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేసింది. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం ప్రియాంక సింగ్ ఆశించిన స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకోవడం లేదు.
సోషల్ మీడియాలో యాక్టవ్:గతంలో కంటే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అందాల ఆరబోతలో తగ్గట్లే:ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో ఈ మధ్య మరింతగా రచ్చ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లే కుళ్లుకునే విధంగా ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను ఖుషీ చేస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ బోల్డు షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో వదులుతోంది. ఫలితంగా ప్రియాంక సింగ్ యమా ట్రెండింగ్ అవుతోంది.

ప్రియాంక సింగ్ పిక్స్ వైరల్:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచుతూ రచ్చ లేపుతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చాలా బ్లేజర్ బటన్స్ తీసేసి లోదుస్తులతో కనిపించింది. పైగా బాత్‌టబ్‌లో పడుకుని హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఆమె అందాలు బాగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











