షాకింగ్‌గా ప్రియాంక సింగ్ బాత్ వీడియో.. ఆడాళ్లే సిగ్గు పడేంత ఘాటుగా!
ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ఆర్టిస్టులు ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. అందులో అతి తక్కువ మంది మాత్రమే సెన్సేషన్‌గా మారిపోతున్నారు. అలాంటి వారిలో ఫేమస్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు.
చాలా కాలం క్రితమే జబర్ధస్త్‌లోకి సాయి తేజగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారడంతో ఈమె సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, తాజాగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

లేడీ గెటప్ - ట్రాన్స్‌జెండర్: ముందుగా సాయి తేజ జబర్ధస్త్ షోలో సందడి చేసి.. ఎన్నో స్కిట్లలో లేడీ గెటప్‌లతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అలా అప్పట్లో ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. ఇక, ఈ ఆపరేషన్ తర్వాత ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో కష్టాలు పడింది. దీంతో చాలా కాలం బుల్లితెరపై కనిపించలేదు.

బిగ్ బాస్ ఆఫర్‌తో ఫుల్లుగా: ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్‌కు పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో ఆమె కెరీర్ డౌట్‌లో పడిపోయింది. ఈ పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. అప్పుడు మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంటర్ అవగా.. పింకీ మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. తద్వారా ఫుల్‌గా క్రేజ్‌ను పెంచుకుంది.

లవ్ ట్రాక్.. ఎలిమినేషన్: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రియాంక సింగ్ బాగా హైలైట్ అయింది. కట్టు బొట్టు విషయంలో అమ్మాయిల కంటే పద్దతిగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన రీతిలో అలరించింది. కానీ ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.

ఆ సినిమా.. అతడికి జోడీ: ప్రియాంక సింగ్ క్రేజ్ బిగ్ బాస్ తర్వాత రెట్టింపు అయింది. దీంతో ఆమెకు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాలు భారీ స్థాయిలో లభించాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్‌తో ఓ సినిమాను ప్రకటించింది. అలాగే కొన్ని షోలలోనూ రచ్చ చేసింది. ఇక, ఇప్పుడేమో ప్రియాంక సింగ్ జీ తెలుగులో 'సూపర్ జోడీ' అనే డ్యాన్స్ షోలో సందడి చేస్తుంది.
అందులో ఫుల్ యాక్టివ్‌గా: ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింతగా యాక్టివ్ అయిందని చెప్పాలి. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ దూసుకుపోతోంది.

గ్లామర్ షోతో అరాచకంగా: సోషల్ మీడియాలో ప్రియాంక సింగ్ ఈ మధ్య మరింతగా రెచ్చిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫొటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను ఖుషీ చేస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ గ్లామర్ షో ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రియాంక సింగ్ తరచూ ట్రెండ్ అవుతోంది.
పింకీ వీడియో వైరల్‌గా: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో హాట్ డోస్ పెంచేసి రెచ్చిపోతోన్న ప్రియాంక సింగ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్‌టబ్‌లో ఘాటుగా ఫోజులిస్తూ కనిపించింది. పైగా ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఫలితంగా ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











