Rashmi Gautam : మెహందితో యాంకర్ రష్మి .. బ్లాస్టింగ్ లాంటి న్యూస్ అంటూ పోస్ట్

టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో ఎందరో నటీనటులు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్నారు. వీరి పెళ్లెప్పుడు అవుతుందా అని వారి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఒక్క సినీ పరిశ్రమే కాదు.. బుల్లితెర మీదా యాంకర్లు, ఇతర నటీనటుల్లోనూ ఇలాంటి బ్యాచిలర్స్ ఎందరో. ఇక తెలుగు స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ పేరు కూడా ఈ లిస్ట్‌లో కనిపిస్తుంది. ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగింటి లోగిళ్లకు రష్మీ గౌతమ్ బాగా దగ్గరయ్యారు. జబర్దస్త్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ ఆమె ఫస్ట్ మూవీ. ఆ సినిమాలో స్టార్ కమెడియన్ సునీల్‌కు ప్రియురాలిగా అతనిపై పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించారు. ఆ సినిమా వచ్చి ఇప్పటికీ దాదాపు 22 ఏళ్లు.. అంటే ఈ లెక్కన రష్మీ వయసు ఎంత ఉండాలి అంటూ నెటిజన్లు చర్చించుకుంటూ ఉంటారు.

jabardasth fame rashmi gautam mehndi photos goes viral

హోలీ తర్వాత గ్యాప్ తీసుకున్న రష్మి.. తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్‌బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్‌లో రష్మీ గౌతమ్ నటించింది. సినిమాల్లో నటించినప్పటికీ.. జబర్దస్త్ షో వల్లనే ఆమెకు గుర్తింపు, గౌరవం లభించాయి . అనసూయ భరద్వాజ్ జబర్దస్త్‌కు, రష్మీ గౌతమ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు యాంకర్లుగా చేసేవారు. సినిమాల్లో బిజీ కావడంతో రంగమ్మత్త యాంకరింగ్ నుంచి తప్పుకున్నారు. కానీ రష్మీ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నారు. తనకు కూడా సినిమాల్లో బాగానే ఆఫర్లు వస్తున్నా జబర్దస్త్‌ను మాత్రం విడిచిపెట్టలేదు. ఈ ప్రోగ్రామ్‌‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే షోలు, సినిమా ఈవెంట్లను చేస్తున్నారు.

ఇన్నేళ్లు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి మాటల ఎత్తకపోవడంపై అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. జబర్తస్త్ ఫేమ్, మరో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉందని .. ఏళ్లుగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎన్నో రూమర్లు వైరల్ అయ్యాయి . రేపో మాపో వీరి పెళ్లి జరగబోతోందని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో రష్మీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది.

దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలే. మెహంది పెట్టుకుంటూ చిరు నవ్వులు చిందిస్తున్న రష్మి .. ఓ కన్ను కొడుతూ టైమ్ టూ ఫోటో బాంబ్, మై ఫీడ్ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలేం జరుగుతోంది, సుధీర్‌తో మ్యారేజ్ ఎప్పుడు రష్మి గారు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: rashmi gautam movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X