ఎన్నేళ్లయినా వెయిట్ చేస్తా .. జబర్దస్త్ రష్మీ గౌతమ్ షాకింగ్ పోస్ట్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు రష్మీ గౌతమ్. వచ్చి రానీ తెలుగులో ఆమె వేసే పంచ్‌లు, అందాల ప్రదర్శనతో ఆ షోకు బాగానే ప్లస్‌గా మారారు. దాదాపు 10 ఏళ్లకు పైగా జబర్దస్త్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఆ షోతో పాటు పలు కార్యక్రమాలను కూడా హోస్ట్ చేస్తూ వాటిని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు రష్మీ గౌతమ్. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది . ఈ వివరాల్లోకి వెళితే..

అప్పుడెప్పుడో ఉదయ్ కిరణ్ హీరోగా హీరోగా వచ్చిన హోలీలో రష్మీ గౌతమ్ తళుక్కున మెరిశారు. ఆ సినిమాలో కమెడియన్ సునీల్‌కు ప్రియురాలిగా పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించారు. తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్‌బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్‌లో రష్మీ గౌతమ్ నటించారను. సినిమాల్లో నటించినప్పటికీ.. జబర్దస్త్ షోను మాత్రం విడిచిపెట్టలేదు. అలాగే ఈటీవీతో తన ప్రయాణాన్ని మాత్రం ఆపడం లేదు.

jabardasth fame rashmi gautam shared emotional post goes viral

40కి చేరువ అవుతున్నా రష్మీ గౌతమ్ ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. జబర్దస్త్ ఫేమ్, హీరో సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉన్నారంటూ ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది జబర్దస్త్ స్కిట్‌లో ఒక భాగమని ఆమె పలుమార్లు చెప్పినా ఎవ్వరూ వినే పరిస్ధితుల్లో జనం లేరు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్లే ఎక్కువ. కానీ పెళ్లి గురించి అడిగేసరికి సుధీర్ కానీ, రష్మీ కానీ నోరు మెదపకుండా నవ్వుతూ తప్పించుకుంటారు.

జబర్దస్త్‌తో పాటు పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా చేయడంతో పాటు సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో రష్మీ బిజీగా ఉంటున్నారు. అయితే ఆమె స్వతహాగా పర్యావరణ , జంతు ప్రేమికురాలు. రోడ్డుపై ఉన్న మూగజీవాలను సంరక్షించడంతో పాటు వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ సమయంలో కుక్కలు, ఇతర మూగజీవాలకు ఆహారాన్ని అందించి శెభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు.. వాటికి ఎవరైనా హానీ తలపెడితే వారి అంతుచూసే వరకు వదిలిపెట్టదు రష్మీ.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మీ గౌతమ్ తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. గోదావరి నదిలోకి పడవపై వెళ్లిన రష్మీ నదిలో అస్తికల్ని నిమజ్జనం చేశారు. అవి ఇటీవల మరణించిన తన పెంపుడు కుక్కవి కావడంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. దాని పేరు చుట్కి గౌతమ్.. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ కుక్క కొద్దిరోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది.

నాటి నుంచి ఎంతో బాధను అనుభవిస్తున్న రష్మీ దానికి అంత్యక్రియలు పూర్తి చేసి చితా భస్మాన్ని గోదావరి నదిలో కలిపారు. జీవితాంతం నిన్ను మిస్ అవుతాననని.. మళ్లీ జన్మ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని రష్మీ గౌతమ్ తన నేస్తానికి తుది వీడ్కోలు పలికారు.

More from Filmibeat

Read more about: jabardasth rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X