యాంకర్ రష్మీ గౌతమ్‌కు కరోనా పాజిటివ్.. జబర్దస్త్ షూటింగ్స్ రద్దు.. సుడిగాలి సుధీర్‌కు కూడా
టెలివిజన్ హోస్ట్, సినీ హీరోయిన్ రష్మీ గౌతమ్ కరోనా బారిన పడ్డినట్టు వార్తలు వచ్చాయి. రష్మీ గౌతమ్ కంటే ముందుగా తన తోటి టీవీ నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు కూడా కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం మీడియాలో వైరల్ మారింది. తాజాగా రష్మీ గౌతమ్‌కి కూడా కరోనా పాజిటివ్ రావడంతో పలు షూటింగులను వాయిదా వేసినట్టు ప్రాథమిక సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..
Recommended Video

రష్మీ గౌతమ్ అధికారికంగా
రష్మీ గౌతమ్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో కరోనాటెస్టులు చేయించుకొన్నారని, ఆ రోగ నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అనే విషయాన్ని సన్నిహితులు ధృవీకరిస్తున్నారు. అయితే అధికారికంగా రష్మీ గౌతమ్ కరోనా పాజిటివ్ అనే విషయాన్ని ధృవీకరించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై రష్మీ అధికారికంగా స్పందిస్తే గానీ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

స్వీయ గృహ నిర్బంధంలో స్టార్ యాంకర్
ఇదిలా ఉండగా, కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం బయటపడిన తర్వాత రష్మీ ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. క్వారంటైన్లోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని జబర్దస్త్ యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

జబర్దస్త్ షూటింగ్స్ రద్దు
యాంకర్ రష్మీ గౌతమ్‌కు కరోనా సోకడంతో పలు షోల షూటింగులను రద్దు చేసినట్టు తెలిసింది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంంధించి అక్టోబర్ 23న, అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

సుధీర్‌తోపాటు మరికొందరికి కూడా
ప్రస్తుతం సుధీర్, రష్మీతోపాటు మరికొంద మంది యూనిట్ సభ్యులు కరోనా బారిన పడటంతో నవంబర్ తొలివారం వరకు షూటింగ్స్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ రెండు కామెడీ షోల షూటింగ్స్ నవంబర్ తొలివారంలో మొదలవుతాయి అని తెలిసింది.

అక్కా ఎవరే అతగాడు షూట్‌లో సుధీర్‌తో
ఇదిలా ఉండగా, దసరా పండుగను పురస్కరించుకొని జరిపిన అక్కా ఎవరే అతగాడు స్పెషల్ కార్యక్రమంలో రష్మీ, సుధీర్, రాంప్రసాద్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ స్పెషల్ షోకు సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. ఈ షూటింగ్‌లో వర్షిణి, సంగీత, శేఖర్ మాస్టర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

బొమ్మ బ్లాక్‌బస్టర్ ప్రమోషన్‌కు దూరం
ఇదిలా ఉండగా, రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నందుతో కలిసి నటించారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్న సమయంలోనే రష్మీకి కరోనా సోకడంతో ఆ కార్యక్రమాలను కూడా కొద్ది రోజులు నిలిపివేసినట్టు తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు కరోనా పాజిటివ్ అనే విషయంపై అధికారికంగా రష్మీ స్పందిస్తుందా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











