నేరం ఒప్పుకున్న రీతూ చౌదరి.. జబర్దస్త్ బ్యూటీ అరెస్ట్ నుంచి తప్పించుకొంటుందా?

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు రీతూ చౌదరి. హైపర్ ఆది సహా పలువురు టీమ్స్‌లో తళుక్కున మెరిసిన ఈ భామ అంతకుముందు సీరియల్స్‌ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. అయితే జబర్దస్త్ ద్వారానే ఆమెకు ఫేమ్ వచ్చింది. అలాగే కొన్ని కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించి షార్ట్ గ్యాప్‌లో బాగానే క్లిక్ అయ్యారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతూ ఉంటారు. తాజాగా రీతూ చౌదరి షేర్ చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.

తొలుత గోరింటాకు అనే సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది రీతూ చౌదరి. ఆ తర్వాత సూర్య వంశం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన పెళ్లి చూపులు షోతో రీతూ చౌదరి జనాలకు బాగా నోటెడ్ అయ్యింది. యాంకర్, నటిగా రాణిస్తున్న సమయంలో ఓ రోజున జబర్దస్త్‌లో స్కిట్ చేయడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ స్కిట్ బాగా పేలడంతో జబర్దస్త్‌లో బలంగా జెండా పాతింది రీతూ చౌదరి.

Jabardasth Fame rithu chowdary apologies to public for promoting betting apps

ఈటీవీతో పాటు పలు ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్, ఓటీటీలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రీతూ చౌదరి.. ఇటీవల ఏపీలో ఏకంగా రూ.700 కోట్ల ల్యాండ్ స్కాంలో చిక్కుకున్నారు. ఆమె భర్త శ్రీకాంత్ చౌదరి కొందరినీ బెదిరించి ఆస్తులను తన పేరిట రాయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారాలు తనకు తెలియదని, తాను శ్రీకాంత్ విడిపోయామని ఫ్యామిలీ కోర్టులో కేసు నడుస్తున్నట్లు రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. తాను షూటింగ్, ఈవెంట్స్‌లలో బిజీగా ఉండటం వల్ల శ్రీకాంత్ ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియదని తేల్చిచెప్పింది. కొన్నాళ్లే ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన ఈ వివాదం ప్రస్తుతం సద్దుమణిగింది.

కాగా.. దేశంలో విచ్చలవిడిగి పెరిగిపోతున్న బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారించారు. గతంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం దేశాన్ని ఊపేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక పలువురి సెలబ్రెటీలు.. ముఖ్యంగా హీరో , హీరోయిన్ల పేర్లు వినిపించడం కలకలం రేపింది. సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారకర్తలుగా మారారు. వారి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా ఖాతాలలో ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేశారు. తమ అభిమాన తారలు చెప్పడంతో నిజమేనని నమ్మిన కొందరు అమాయకులు బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పుల పాలవ్వడంతో పాటు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.

దీంతో బెట్టింగ్ యాప్స్‌ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపైనా దృష్టి సారించి , పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను అరెస్ట్ చేసింది. దీంతో మిగిలిన వారు అప్రమత్తమవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రీతూ చౌదరి కూడా చేరింది. తాను గతంలో కొన్ని బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశానని.. అవి ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయని తెలిపారు. తెలిసో తెలియకో చేసిన తప్పుని క్షమించాలని, బెట్టింగ్ యాప్స్ గురించి సెలబ్రెటీలు చెప్పేది నమ్మొద్దని, మీ ఫోన్లలో ఇలాంటి యాప్స్ ఉంటే డిలీట్ చేయాలని సూచించింది రీతూ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X