Rithu Chowdary: సైమాలో సెగలు రేపిన రీతూ చౌదరీ.. రెడ్ కార్పెట్‌పై జబర్దస్త్ బ్యూటీ అలా చూపిస్తూ!
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. నాలుగు గోడల మధ్యన ఉన్న టాలెంట్‌ను నలుగురికి పరిచయం చేసి ప్రతిభావంతులకు ఓ వేదిక మారింది. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, షకలక శంకర్, ధనరాజ్, వేణు, గెటప్ శ్రీను సహా చాలా మంది సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ కోవలోకి వస్తుంది రీతూ చౌదరి. ఆమె గురించి లేటెస్ట్ అప్‌డేట్స్‌లోకి వెళితే..
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్‌లోకి వచ్చి బాగా నోటెడ్ అయ్యింది. ఈ ఫ్లాట్‌ఫాం నుంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది. జబర్దస్త్‌లోనే కాకుండా ఈటీవీలోనే ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. ఈ రెండింటితో పాటు తెలుగు బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తోంది.

జబర్దస్త్‌తో పాటు మాటీవీ, జెమినీ, జీ తెలుగులో పలు సీరియల్స్‌లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలో గతేడాది నవంబర్‌లో రీతూ చౌదరి నాన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఆ షాక్ నుంచి తేరుకుని తిరిగి తన షోలు, ఇతర కార్యక్రమాల్లో యాక్టీవ్ అవుతోంది రీతూ చౌదరి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మా నాయనమ్మ సంవత్సరీకం ఉండటంతో తాము స్వగ్రామానికి వెళ్లామని చెప్పింది.
నాన్న చనిపోవడానికి ముందు రోజు రాత్రి అందరం సరదాగా మాట్లాడుకున్నామని, సెల్ఫీలు దిగి పడుకున్నామని రీతూ వెల్లడించింది. ఉదయాన్నే డాడీ చనిపోయాడని బాబాయ్ నిద్రలేపాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. రాత్రంతా సరదాగా ఉన్న డాడీ.. పొద్దున్నే అలా కనిపించేసరికి తట్టుకోలేకపోయానని రీతూ వాపోయింది. నా సంపాదనతో కొన్న కారు అంటే నాన్నకి ఇష్టమని, చివరికి ఆ కారులోనే ఆయనను వెనుక సీట్లో తీసుకొచ్చానని కన్నీటి పర్యంతమైంది.

బుల్లితెర నటుల్లో యాంకర్ విష్ణుప్రియతో రీతూ చౌదరి బాగా క్లోజ్‌గా ఉంటారు. ఎప్పుడు ఖాళీ దొరికినా ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ వేస్తారు. విధి విలాసమో, లేక యాధృచ్ఛికమో కానీ రీతూ తండ్రి, విష్ణుప్రియ తల్లి ఇద్దరూ రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తీవ్ర విషాదంలో ఉన్నా.. కష్టసుఖాలను పంచుకుంటున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. స్కిన్ షోకి ఏమాత్రం మొహమాట పడకుండా హద్దులు దాటుతుంది. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా తన పని తాను చేసుకుపోతుంది రీతూ చౌదరి. తాజాగా సైమా అవార్డ్స్ సెర్మనీలో ఈ ముద్దు గుమ్మ సందడి చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఎద అందాలు, బిగ్ థైస్ చూపిస్తూ గిలిగింతలు పెడుతోంది. ప్రస్తుతం రీతూ చౌదరి హాట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











