Rithu Chowdary: దారుణంగా రీతూ చౌదరి పరిస్ధితి .. 700 కోట్ల స్కామ్ ఆరోపణల తర్వాత..!
రీతూ చౌదరి.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగు లోగిళ్లకు సుపరిచితం. ఇక కుర్రాళ్లకైతే ఈవిడ సోషల్ మీడియా పోస్టులు నిద్రలేకుండా చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తుంది రీతూ చౌదరి. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్, అందులో ఆమె చేస్తున్న పనులు చర్చనీయాంశమయ్యాయి.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో హైపర్ ఆది సహా పలువురి టీమ్‌లో హల్ చల్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది రీతూ చౌదరి. ఈ షోలో గ్లామర్‌తో పాటు తన కామెడీ టైమింగ్‌తో పంచ్‌లు కూడా విసురుతూ శెభాష్ అనిపించుకుంది. జబర్దస్త్‌తో పాటు ఫ్యామిలీ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు కూడా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో రీతూ చౌదరి పేరు బయటికి రావడంతో సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

దీని వెనుక ప్రధాన సూత్రధారి ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంతేనంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అసలు రీతూ చౌదరికి పెళ్లెప్పుడు అయ్యింది అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు. అంతేకాదు ఆమె అసలు పేరు రీతూ చౌదరి కాదని.. వనం దివ్య అని వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. ఇండస్ట్రీలో పైకి ఎదుగుతున్న దశలో తన స్క్రీన్ పేరును రీతూ చౌదరిగా మార్చుకుంది. ఆమె తండ్రి పేరు కూడా వనం శేఖర్.
ఈ స్కాం నేపథ్యంలో ఇటీవల రీతూ చౌదరి ఓ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ.. తనకు శ్రీకాంత్‌తో వివాహం జరిగిన మాట వాస్తవమేనని అసలు సంగతి బయటపెట్టింది. 2022లో తనకు, శ్రీకాంత్‌కు పెళ్లి జరిగిందని.. కానీ కొన్ని కారణాలతో ఆరు నెలలకే విడిపోయామని, ప్రస్తుతం విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని రీతూ బాంబు పేల్చింది. శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు చేస్తాడని తెలుసని.. అయితే తాను షూటింగ్స్, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో భర్తతో గడిపే సమయం కూడా ఉండేది కాదని తెలిపింది. శ్రీకాంత్ చేసిన భూ దందాకు సంబంధించి తనకేం తెలియదని క్లారిటీ ఇచ్చింది.
ఈ వివాదాలను, గొడవలను పట్టించుకోకుండా తన రోజువారీ కార్యక్రమాల్లో రీతూ చౌదరి బిజీగా ఉంటోంది. మొన్నామధ్య తన మెడలో రుద్రాక్ష వేసుకుని రీతూ చౌదరి కనిపించడం చర్చనీయాంశమైంది. మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండేందుకే ఆమె రుద్రాక్షను ధరించి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, తన షోలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నలుపు రంగు చీరను కట్టి నాభి, నడుము అందాలు ఆరబోసింది . ఇక్కడి వరకు పర్లేదు కానీ రోడ్డుపై కొబ్బరి బొండాలు నరుకుతూ కనిపించడంతో రీతూ చౌదరికి ఏమైందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











