బాంబు పేల్చిన రీతూ చౌదరి .. మెడలో అది వేసుకుని షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
రీతూ చౌదరి.. గత కొద్దిరోజులుగా ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో పాటు చిన్నా చితకా కార్యక్రమాలను హోస్ట్ చేసుకునే ఈమె గురించి ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తన షోలు, షార్ట్ ఫిల్మ్, ఇతర పనుల్లో బిజీగా ఉండే రీతూ చౌదరి చుట్టూ రాజకీయాలు తిరుగుతుండటం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది రీతూ చౌదరి. అంతకంటే ముందు సీరియల్స్‌లో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ జబర్దస్త్ తర్వాతే రీతూ చౌదరి తెలుగువాళ్లకి బాగా దగ్గరైంది. హైపర్ ఆది టీమ్‌లో మంచి స్కిట్లలో కనిపించడంతో ఆమెకు ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బుల్లితెరపై టీవీ షోలు, హోస్టింగ్, ప్రైవేట్ ఈవెంట్స్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో బిజీగా గడుపుతున్నారు రీతూ.

తన కామెడీ టైమింగ్‌తో నవ్వించడంతో పాటు సీరియల్స్‌లో సెంటిమెంట్ పండించి ఏడిపించింది కూడా. ఇటీవల పలు సినిమాల్లోనూ ఈ అమ్మడు ఆఫర్లు అందుకుంది. రీతూ చౌదరి తన సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తోంది. మొన్నామధ్య టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుమారుడితో కలిసి రిసార్ట్స్ బిజినెస్‌లో దిగింది.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో రీతూ చౌదరి పేరు బయటికి రావడంతో సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దీని వెనుక ప్రధాన సూత్రధారి ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంతేనంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇంతకీ రీతూ చౌదరికి పెళ్లెప్పుడు అయ్యింది అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ స్కాం నేపథ్యంలో ఓ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ.. తనకు వివాహం జరిగిన మాట వాస్తవమేనని నోరు విప్పింది. 2022లో నాకు, శ్రీకాంత్‌కు పెళ్లి జరిగిందని.. కానీ కొన్ని కారణాలతో ఆరు నెలలకే విడిపోయామని, ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని రీతూ చౌదరి చెప్పింది.
శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు చేస్తాడని తెలుసని.. అయితే తాను షూటింగ్స్, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో అతనితో గడిపిన సమయం కూడా చాలా తక్కువని రీతూ వ్యాఖ్యానించింది. శ్రీకాంత్ చేసిన భూ దందాకు సంబంధించి తనకు ఎలాంటి విషయాలు తెలియవని కుండబద్ధలు కొట్టింది. ఈ గొడవలేవీ పట్టించుకోకుండా తన రోజువారీ కార్యక్రమాల్లో రీతూ చౌదరి బిజీగా ఉంటోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, తన షోలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆకుపచ్చ, ఎరుపు కాంబినేషన్‌లో ఉన్న చీరను కట్టి సొగసులు ఆరబోసింది రీతూ. ఇక్కడి వరకు పర్లేదు కానీ ఆమె మెడలో రుద్రాక్ష వేసుకుని కనిపించడం చర్చనీయాంశమైంది. మరి ఇంకేందుకు ఆలస్యం రీతూ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











