చీరలో అగ్గిరాజేస్తోన్న రీతూ చౌదరి.. బ్యాక్ అందాలతో టెంప్ట్ చేస్తోన్న జబర్దస్త్ పోరి
రీతూ చౌదరి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార - విపక్ష పార్టీల మధ్య ఈమె వ్యవహారంగా ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. ఓ చిన్నా చితకా నటి ఆ స్థాయిలో ఏం చేసిందో అర్ధం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు. కానీ ఇంత జరుగుతున్నా రీతూ చౌదరి మాత్రం ఎప్పటిలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ రెచ్చగొడుతోంది.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది రీతూ చౌదరి. అంతకంటే ముందు సీరియల్స్‌లో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ జబర్దస్త్ తర్వాతే రీతూ చౌదరికి బ్రేక్ వచ్చింది. అలాగే సింగ్ యశస్వికి స్టేజ్ పైనే హగ్ ఇచ్చి, ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లో మంచి స్కిట్లలో కనిపించడంతో రీతూ చౌదరి దశ తిరిగింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తన కామెడీ టైమింగ్‌తో నవ్వించడంతో పాటు సీరియల్స్‌లో సెంటిమెంట్ పండించి ఏడిపించింది కూడా. జబర్దస్త్‌తో పాటు పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో పలు ప్రోగ్రామ్స్‌లో నటించిన రీతూ చౌదరి తన సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తోంది. మొన్నామధ్య టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుమారుడితో కలిసి రిసార్ట్స్ బిజినెస్‌లో దిగినట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో రీతూ చౌదరి పేరు బయటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. అలాగే ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్‌పై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలతో నెటిజన్లు షాకయ్యారు. అసలు రీతూ చౌదరికి పెళ్లెప్పుడు అయ్యింది అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ స్కాం నేపథ్యంలో ఓ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ.. తనకు వివాహం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది. 2022లో నాకు, శ్రీకాంత్‌కు పెళ్లి జరిగిందని.. కానీ ఆరు నెలలకే విడిపోయామని, ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని రీతూ చౌదరి వెల్లడించారు.
శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడని తెలుసని.. అయితే తాను ఎక్కువగా షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో అతనితో గడిపిన సమయం కూడా చాలా తక్కువని రీతూ చౌదరి చెప్పింది. ఆ భూ దందాకు సంబంధించి తనకు ఎలాంటి విషయాలు తెలియవని, తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని ఆమె క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ రీతూ చౌదరి పేరు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తూనే ఉంది.
https://www.instagram.com/p/DEr3iGPpJxr/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఈవెంట్లు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పెద్ద కాంట్రవర్సీ జరిగినా రీతూ చౌదరి మాత్రం తగ్గడం లేదు. తాజాగా గ్రీన్ కలర్ శారీలో , బ్యాక్ అందాలు, నడుము మడతలను చూపెడుతూ రీతూ చౌదరి చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ జబర్దస్త్ పోరి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











