Rithu Chowdary : పరువాల గేట్లు ఎత్తేసిన రీతూ చౌదరి.. చిలకపచ్చ కోకలో బ్యాక్‌లెస్ ఫోజులు!!
ఈటీవీలో దాదాపు పదేళ్ల పై నుంచి ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ప్రతిభ ఉండి దానిని ఎలా ప్రదర్శించి అవకాశాలు ఎలా పొందాలో తెలియని వారికి జబర్దస్త్ వేదికగా మారింది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, షకలక శంకర్, ధనరాజ్, వేణు, గెటప్ శ్రీను సహా చాలా మంది సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ కోవలోకి వస్తుంది అల్లరి పిల్ల రీతూ చౌదరి. ఆమె గురించి లేటెస్ట్ అప్‌డేట్స్‌లోకి వెళితే..
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి.. గతంలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్‌లోకి వచ్చి బాగా నోటెడ్ అయ్యింది. హైపర్ ఆది టీమ్‌లో ఉన్నప్పుడు రీతూకి మంచి ఫేమ్ దక్కిందని అంటారు. మేల్ డామినేటింగ్ షోగా ముద్రపడిన జబర్దస్త్ నుంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది రీతూ. జబర్దస్త్‌తోనే కాకుండా ఈటీవీలోనే ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ సహా పలు షోలలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

ఈ రెండింటితో పాటు తెలుగు బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో తన హవా చూపిస్తోంది రీతూ. జబర్దస్త్‌తో పాటు మాటీవీ, జెమినీ, జీ తెలుగులో పలు సీరియల్స్, ప్రోగ్రామ్‌లలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఇటీవల మాటీవీలో ప్రసారమైన కిరాక్ బాయ్స్ - ఖిలాడి గర్ల్స్ షోలో రీతూ హైలైట్‌గా నిలిచింది. అందాల ప్రదర్శనతో పాటు జోకులు, పంచ్‌లతో ఈ షో బాగా పాపులర్ కావడానికి తన వంతు పాత్ర పోషించింది.
ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలో గతేడాది నవంబర్‌లో రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆ షాక్ నుంచి తేరుకుని తిరిగి తన షోలు, ఇతర కార్యక్రమాల్లో యాక్టీవ్ అవుతోంది రీతూ చౌదరి. బుల్లితెర నటుల్లో యాంకర్ విష్ణుప్రియతో రీతూ చౌదరి బాగా క్లోజ్‌గా ఉంటారు. ఎప్పుడు ఖాళీ దొరికినా ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ వేస్తారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. స్కిన్ షోకి ఏమాత్రం మొహమాట పడకుండా హద్దులు దాటుతుంది. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా తన పని తాను చేసుకుపోతుంది ఈ జబర్దస్త్ పోరి.
మొన్నామధ్య సైమా అవార్డ్స్ సెర్మనీలో రీతూ చౌదరి సందడి చేసిన సంగతి తెలిసిందే. మోడ్రన్ డ్రెస్సులే కాదు అప్పుడప్పుడు చీర కట్టి అందాలు ఆరబోస్తుంది. తాజాగా చిలకపచ్చ చీరలో పరువాలకు గేట్లు ఎత్తేసిందా అన్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ జాకెట్‌లో బ్యాక్ చూపిస్తూ రీతూ సెగలు రేపుతోంది. మీరు ఆ అందాలు మిస్ అయ్యంటే తక్షణం చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











