పొట్టిగౌనులో హద్దులు దాటేసిన రీతూ చౌదరి.. మిర్రర్ ముందు అరాచకం!
బుల్లితెర ద్వారా ఫేమస్ అయిన నటీమణుల్లో రీతూ చౌదరి ఒకరు. తన అందం, చలాకీతనంతో అనతికాలంలోనే యూత్‌లో మంచి ఆదరణ దక్కించుకున్న రీతూ.. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. సీరియల్స్, షోలు, సినిమాలతో ఇండస్ట్రీని దున్నేస్తోన్న రీతూ చౌదరి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ ద్వారా తొలుత ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరికి జబర్దస్త్ కార్యక్రమం బ్రేక్ ఇచ్చింది. మధ్య మధ్యలో పంచ్‌లు విసురుతూ జనానికి బాగానే నోటెడ్ అయ్యింది రీతూ చౌదరి. హైపర్ ఆది టీమ్‌తో పాటు పలు టీమ్స్‌లోనూ అలరించింది. ఈటీవీతో పాటు ఇతర ఛానెల్స్‌లోనూ క్రేజీ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసింది. అలాగే యూట్యూబ్ ఛానెల్స్‌లో హోస్ట్‌గానూ ఆకట్టుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న దశలో ఆమె తండ్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

మొన్నామధ్య రీతూ చౌదరి పేరు ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. రూ.700 కోట్ల భూ కుంభకోణం వెలుగు చూడటం అందులో రీతూతో పాటు ఆమె భర్త శ్రీకాంత్ పేర్లు తెరపైకి రావడంతో సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఈ కేసు, తనపై వస్తున్న ఆరోపణలపై రీతూ చౌదరి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తనకు శ్రీకాంత్‌కు 2022లో పెళ్లి జరిగిందని, కానీ కొద్దినెలలకే తాము విడిపోయామని రీతూ చౌదరి చెప్పింది. ఇద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని.. ఈ కేసు కోర్టులో నడుస్తోందని రీతూ చౌదరి తెలిపారు.
పెళ్లాయ్యాక కూడా శ్రీకాంత్‌తో గడిపే సమయం ఉండేది కాదని తన సినిమాలు, షోలు, షూటింగ్స్‌కే సరిపోయేదని రీతూ చౌదరి వెల్లడించింది. శ్రీకాంత్ చేసే పనుల గురించి తనకేం తెలియదని.. అతను రియల్ ఎస్టేట్ సహా కొన్ని వ్యాపారాలు చేసేవాడని పేర్కొంది. ఇంత జరుగుతున్నా ఇవేవీ పట్టించుకోకుండా తన సినిమాలు, షోలలో బిజీగా ఉంది. అలాగే వ్యాపారంలోనూ రీతూ చౌదరి ప్రవేశించింది. సీనియర్ నటుడు శివాజీ రాజా కుమారుడితో కలిసి ఆతిథ్య రంగంలోకి ఈమె అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, తన షోలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే జరుగుతున్న గొడవలు, వివాదాల నేపథ్యంలో మానసిక ప్రశాంత కోసం రీతూ చౌదరి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గోల్డ్ కలర్‌లో ఉన్న పొట్టి గౌన్ వేసుకుని రీతూ చౌదరి అద్దం ముందు అందాలు ప్రదర్శిస్తూ ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. రీతూ చౌదరి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











