నన్ను గదికి రమ్మని అడిగారు, తప్పు చేయనని చెప్పా: జబర్దస్త్ సాయి తేజ్

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేయడం ద్వారా పాపులర్ అయిన సాయి తేజ్ ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ తర్వాత తన పేరును కూడా ప్రియాంక సింగ్‌గా మార్చుకున్నారు. తనకు బై బర్త్ ఆ ఫీలింగ్స్ ఉండటం వల్లనే ఇలా మారిపోయానని గతంలోనే ఆమె వెల్లడించారు.

ప్రియాంక సింగ్‌గా మారిన తర్వాత తాను సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించానని, ఇక్కడ తాను క్యాస్టింగ్ కౌచ్ సమస్య కూడా ఫేస్ చేసినట్లు సాయితేజ్ అలియాస్ ప్రియాంక సింగ్ తెలిపారు. తప్పు చేసి అవకాశాలు దక్కించుకోవడం నా లక్ష్యం కాదు, అందుకే చాలా అవకాశాలు వదులుకున్నట్లు వెల్లడించారు.

నిర్మాత, దర్శకుడు నన్ను గదికి రమ్మని అడిగారు

నిర్మాత, దర్శకుడు నన్ను గదికి రమ్మని అడిగారు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ మాట్లాడుతూ... ‘తనకు ఒక సినిమాలో ఐటం సాంగ్ చేసే అవకాశం వచ్చింది, దర్శక నిర్మాతలు ఎక్స్ ఫోజింగ్ చేయాలని చెప్పడంతో చేయడానికి ఒప్పుకున్నాను. ఈ రోజుల్లో హీరోయిన్లే చేస్తున్నారు, నేనెంత? అని చెప్పాను. నేను ఆ మాట అనగానే ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమనుకున్నారో తెలియదు. ‘మనకు వరంగల్‌లో సాంగ్ షూట్ ఉంటుంది, ముగ్గురం కలిసి ఒక రూమ్ తీసుకుందాం అన్నారు....అలా అనగానే వారి తప్పుడు ఉద్దేశ్యం అర్థమైంది.' అని చెప్పుకొచ్చారు.

నేను తప్పు చేసి సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి రాలేదు

నేను తప్పు చేసి సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి రాలేదు

వారి తప్పుడు ఉద్దేశ్యం అర్థంకాగానే... ఒక రూమ్ ఏమిటిసర్... నాకు సపరేటుగా రూమ్ ఇవ్వండి లేదంటే వరంగల్‌లో మా ఫ్రెండ్ రూములో ఉంటాను. అంతే కానీ ఒకే రూములో ఇద్దరం ముగ్గురం ఉండటం చేయను, ఇలా చేయడం కుదరదు. నేను తప్పు చేసేయడానికి సిద్దపడి ఉంటే ఇపుడు మీ ఆఫీసులో కూర్చునేదాన్ని కాదు, ఎప్పుడో ఓ స్థాయికి వెళ్లేదాన్ని, తప్పు చేసి సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి రాలేదు... అని తేల్చి చెప్పినట్లు ప్రియాంక సింగ్ స్పష్టం చేశారు.

అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది

అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది

కేవలం తెలుగులోనే కాదు... అన్ని సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. మనకు నచ్చితే చేయాలి, నచ్చకపోతే చేయకూడదు. అంతే కానీ వాడు పిలచాడు, వీడి పిలిచాడు, అలా చేశారు, ఇలా చేశారని వారిని రోడ్డు మీద పెట్టడం కరెక్ట్ కాదు. మనకు ఇష్టం లేకుండా వాడితో మనం చేయం, నీకు ఇష్టమైతే చేస్తావు, అలా అని ఇక్కడ బలవతం కూడా ఏమీ ఉండదని తెలిపారు.

ఒప్పుకోక పోవడం వల్ల చాలా నష్టపోయాను

ఒప్పుకోక పోవడం వల్ల చాలా నష్టపోయాను

అయితే ఇండస్ట్రీలో అందరూ అలాంటివారే లేరు. నూటికో, కోటికో ఒక్కరు ఉన్నారు. మన ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా వరకు తగ్గిపోయింది. నేనైతే ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య ఫేస్ చేశాను. తప్పుచేయడానికి ఒప్పుకోకపోవడం వల్ల సగం అవకాశాలు పోయినట్లు సాయి తేజ్ అలియాస్ ప్రియాంక సింగ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X