ట్రాన్స్‌జెండర్‌గా మారిన జబర్దస్త్ సాయి తేజ, చావు దగ్గరి వరకు వెళ్లి....
Recommended Video

జబర్దస్త్ షోలలో లేడీ గెటప్స్ వేసే సాయి తేజ ఇపుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు. ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. పేరును కూడా ప్రియాంక సింగ్‌గా మార్చుకున్నారు. ఈ మార్పు తర్వాత ఇటీవల తొలిసారి ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ మాట్లాడుతూ... తనకు బై బర్త్ ఫీలింగ్స్ ఉండటం వల్లనే ఇలా మారిపోయానని తెలిపారు.
డబ్బులు ఎక్కువ వస్తాయనో, మరే కారణం వల్లనో తాను ఇలా మారలేదని, తనకు చిన్నతనం నుంచి ఆ ఫీలింగ్స్ ఉన్నాయని సాయి తేజ తెలిపారు. జనాలు నన్ను ఇప్పటి వరకు సాయి తేజగానే చూశారు. ప్రియాంక సింగ్‌గా చూడాలంటే కాస్త టైమ్ పడుతుంది. వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ అయితే ఉందని తెలిపారు.

మా ఇంట్లో వారికి తెలియదు
ఈ విషయం మా ఫ్యామిలీలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మా నాన్నకి, బ్రదర్స్‌కు తెలియదు. ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే. ఇది దాచుకుంటే దాగే విషయం కాదు. అందుకే ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఆ భయంతోనే ఎవరికీ చెప్పలేదు
నాకు 5 ఏళ్ల యవసులోనే ఈ ఫీలింగ్స్ మొదలయ్యాయి. మా సిస్టర్ స్కూలుకు వెళ్లేపుడు తను వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం, వాళ్లలాగా తయారవ్వడం లాంటిది చేసేదాన్ని. అయితే స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో నాలో ఈ ఫీలింగ్స్ ఉన్న విషయం కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే అపుడు నాకు భయం. మా నాన్నగారికి ఊర్లో మంచి పేరుంది. ఆ భయంతోనే ఎవరికీ చెప్పలేదు.

ఎన్నో రోజులు నాలో నేను ఏడ్చాను
ఇంట్లో వాళ్లకు చెబితే బాధ పడతారని చెప్పలేదు. చాలా సార్లు నాలో నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు నేను ఇలా ఉన్నాను అని భాధ పడేదాన్ని. అయితే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వచ్చాయి.

చావు దగ్గరి వరకు వెళ్లి వచ్చాను
ఆరు నెలల క్రితం ట్రాన్స్‌జెండర్ ఆఫరేషన్ ద్వారా అమ్మాయిగా మారాను. ఈ నాలుగు నెలల్లో చావు దగ్గరకు వెళ్లాను, మళ్లీ బ్రతికాను. జెండర్ చేంజ్ తర్వాత ఆర్తరైటిస్ వచ్చింది. ఆ సమస్యకు ఓ పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాను. ఆ సమయంలో నా నలుగురు ఫ్రెండ్స్ అండగా ఉండటం వల్లనే నేను బ్రతికాను అని సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











