ఆయన వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. సత్య శ్రీ షాకింగ్ కామెంట్స్..

Jabardasth Sathya Sri: ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా పలువురు కమెడియన్లు చిన్న తెర నుంచి వెండితెరకు చేరారు. వారిలో సత్యశ్రీ ఒకరు. తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సత్యశ్రీ, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఆ మధ్య "నా పెట్టీ తాళం తెరిచి..." పాటతో హాట్ టాపిక్ మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్థస్త్ బ్యూటీ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లోని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ప్రధానంగా జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇంతకీ జరిగిందంటే?

కామెడియన్ సత్యశ్రీ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా 'జబర్దస్త్'లోకి వచ్చిన సత్యశ్రీ.. ఈ షో ద్వారానే పెద్ద గుర్తింపు సంపాదించింది. అయితే, చమ్మక్ చంద్ర షో నుంచి బయటకు వచ్చిన వెంటనే తన టీమ్ మొత్తమే బయటకు వెళ్లిపోయింది అని సత్యశ్రీ చెప్పింది. తాను కేవలం చమ్మక్ చంద్ర కోసమే 'జబర్దస్త్' నుంచి బయటకు వచ్చేసిందట. "చంద్ర కోసమే బయటకు వచ్చాను. ఇతర కారణాలేమీ లేవు. బయటకు వచ్చామా? హ్యాపీగా స్కిట్ చేశామా? వచ్చామా? అంతే.. ఎప్పుడూ 'అలా ఎందుకు వచ్చాను?' అనిపించలేదు" అని చెప్పింది. "చంద్రనే గురువుగా భావించాను. ఆయన ఉన్న చోటనే ఉంటాం అన్న నమ్మకంతో జబర్దస్త్ వదిలాం" అని చెప్పింది.

Jabardasth Fame Sathya Sri Reveals Why She Quit the Show From Chammak Chandra Bond

టీమ్ లీడర్ బాధ్యతలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. "టీమ్ లీడర్ అంటే పెద్ద వ్యవహారం. స్కిట్, డైలాగులు, ఆర్టిస్టులు 10 రోజుల ముందే ప్లాన్ కావాలి. నేను ఆ ప్రెషర్ తీసుకోలేను. కంటెస్టెంట్‌గా చేస్తూ హ్యాపీగా ఉండటమే నా స్టైల్" అని చెప్పుకొచ్చింది. తనకు ఇష్టమైన హీరో ఎవరు? అని ప్రశ్నించగా.. సత్యశ్రీ వెంటనే సమాధానం చెప్పింది. "హీరో రామ్ అంటే నాకు క్రష్. 'పండగ చేస్కో' సినిమాలో రకుల్ ఫ్రెండ్ పాత్ర చేశాను. షూట్ టైమ్‌లో నటించడంలేదు... ఆయననే చూస్తూ ఉండిపోయాను. అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం" అంటూ నవ్వింది.

తన వ్యక్తిగత జీవితంపై కూడా సత్యశ్రీ ఎంతో స్పష్టంగా చెప్పింది. "నాకు ప్రేమ, పెళ్లి మీద పెద్ద ఆసక్తి లేదు. నా ప్రొఫెషన్‌కి రిస్పెక్ట్ ఇచ్చే వాడు వస్తే ఆలోచిస్తాను. సంబంధంలో అత్యంత ముఖ్యమైనది అండర్‌స్టాండింగ్ అనుమానం ఉండకూడదు" అని వెల్లడించింది. ఇక తనకు వచ్చిన కొన్ని ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ.. "9వ తరగతిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి టూ మచ్ గా బిహేవ్ అయ్యాడు. మా పేరెంట్స్‌ వార్నింగ్ ఇచ్చారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లు నేరుగా నాతో కాకుండా నా అమ్మతోనే మాట్లాడారు... నన్ను కాదని చెప్పించాను" అని చెప్పింది.

జబర్దస్త్ నుంచి ప్రారంభమైన తన ప్రయాణం..సినిమాల్లో వరుస అవకాశాలు, ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్, వ్యక్తిగత జీవితంపై నిశితమైన అభిప్రాయాలు... ఇవన్నీ కలిపి సత్యశ్రీని నేటి యువ ఆర్టిస్టుల్లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ 2-3 సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు వచ్చినా, ఎక్స్‌పోజ్ చేయాలని అడిగినందుకే తిరస్కరించానని సత్యశ్రీ చెప్పింది. "భవిష్యత్తులో కూడా లిప్‌లాక్‌లాంటి సీన్స్ చేయను. సాయి పల్లవి లాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడతాను" అని క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Read more about: chammak chandra jabardasth sathya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X