twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేడీ గెటప్ మా ప్రొఫెషన్.. మేం మగాళ్లమే.. జబర్దస్త్ శాంతి స్వరూప్ కామెంట్స్ వైరల్

    |

    జబర్దస్త్ షోలో శాంతి స్వరూప్ లేడీ గెటప్పులు వేస్తూ ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులు వేస్తూ స్పెషల్ ఈవెంట్లలో మెరుస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యాంగా హైపర్ ఆది స్కిట్‌లో శాంతి స్వరూప్ మెయిన్ హైలెట్ అవుతుంటాడు. ఆది వేసే సెటైర్లు, పంచ్‌లు శాంతి స్వరూప్‌పై బాగా పేలుతుంటాయి. అలా హైపర్ ఆది వేసే పంచులతోనే శాంతి స్వరూప్ వైరల్ అయ్యాడు.

     సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    ఓ సారి సోషల్ మీడియాలో శాంతి స్వరూప్ బెంజ్ కారుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. అది అప్పట్లో తెగ వైరల్ అయింది. శాంతి స్వరూప్ ఆస్తులు, బెంజ్ కారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఎవరిదో కారు బాగుంది కదా అని ఫోటో దిగాను అది నాది కాదని క్లారిటీ ఇచ్చాడు.

    స్పెషల్ ఈవెంట్లలో...

    స్పెషల్ ఈవెంట్లలో...

    ఈ మధ్య శాంతి స్వరూప్ స్పెషల్ ఈవెంట్లలోనూ రచ్చ చేస్తున్నాడు. దసరా, దీపావళి అంటూ జెమినీ, స్టార్ మా చానెల్‌లో స్పెషల్ ఈవెంట్లు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఆ లేడీ గెటప్పులు మాత్రమే వేస్తుంటాడు. అలా బయట వీరిపై నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    తాజాగా జబర్దస్త్‌లో లేడీ గెటప్పులు వేసే ఆర్టిస్ట్‌లందరినీ సుమ తన క్యాష్ షోలోకి తీసుకొచ్చింది. మొదట అందరూ లేడీ గెటప్పుల్లోనే ఎంటర్టైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లేడీ గెటప్పుల్లో ఉన్నవారంతా సెకండాఫ్‌లో వారి ఒరిజినల్ రూపాల్లో వచ్చారు.

    ఆవేదన..

    ఆవేదన..

    అందరూ తమను లేడీ గెటప్పుల్లో చూసి నిజంగానే తాము అమ్మాయిలమేనని అనుకుంటున్నారు.. అందుకే ఇలా నిజమైన రూపాల్లో వచ్చామని జబర్దస్త్ పవన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ తరువాత సుమ అడిగిన ఓ ప్రశ్నకు శాంతి స్వరూప్ చెప్పిన సమాధానం అందర్నీ కంటతడి పెట్టించింది.

    పెళ్లిపై అభిప్రాయం..

    పెళ్లిపై అభిప్రాయం..

    పెళ్లిపై అభిప్రాయం ఏంటని సుమ శాంతి స్వరూప్‌ను అడిగింది. దానికి శాంతి స్వరూప్.. మా ఫ్యామిలీని పోషించుకోవడం కోసమే ఆ గెటప్పులు వేస్తామని రియల్ లైఫ్‌లో అలా కాదని మమ్మల్ని అర్థం చేసుకోవాలి.. లేడీ గెటప్ మా ప్రొఫెషనల్.. బయటకు వస్తే మేం జెంట్స్ (మగాళ్లం) అని అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.

    English summary
    jabardasth Fame Shanthi Swaroop About Marriage,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X