సుడిగాలి సుధీర్‌కు కరోనా పాజిటివ్! మరి ఆ ఇద్దరి పరిస్థితి ఏమిటి?
యువ హీరో, టెలివిజన్ నటుడు, జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ బిజీగా మారిపోయారు. అయితే కమెడియన్ ప్రస్తుతం కరోనావైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా సుధీర్ స్పందించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయనకు కోవిడ్ పాజిటివ్ అనే విషయాన్ని సన్నిహితులు ధృవీకరిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్ తర్వా బిజీగా సుధీర్
లాక్ డౌన్ తర్వాత వరసగా సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయారు. పలు రకాల టెలివిజన్ రియాలిటీ షోలతో ఆకట్టుకొంటున్నారు. జబర్దస్త్, డీ చాంఫియన్‌తోపాటు పలు షోలలో కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అయితే ఆదివారం అంటే అక్టోబర్ 18వ తేదీన సుధీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిందనే విషయం బయటకు వచ్చింది.

స్వీయ గృహ నిర్బంధంలో కమెడియన్
ప్రస్తుతం కరోనావైరస్ పాజిటివ్ కారణంగా సుధీర్ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అయితే కొన్ని కారణాల వల్ల తన గురించిన వివరాలు వెల్లడించలేకపోయారు. సుధీర్‌తో కాంటాక్ట్ కావడానికి మీడియా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే అధికారికంగా ఈ వార్తపై స్పందించే అవకాశం ఉంది అనే విషయాన్ని సన్నిహితులు పేర్కొన్నారు.

అక్క ఎవడే అతగాడుకు క్రేజీ రెస్సాన్స్
ఇటీవల అక్క ఎవడే అతగాడు అనే స్పెషల్ షో కోసం సుధీర్ సుడిగాలి షూటింగులో పాల్గొన్నారు. దసరా పండుగ కోసం షూట్ చేసిన ఈ షోలో రాంప్రసాద్, రష్మీ గౌతమ్ పాల్గొన్నారు. ఈ షో అక్టోబర్ 25వ తేదీన ప్రసారం కానున్నది. ఇటీవల రిలీజైన ప్రోమోకు మంచి స్పందన లభించింది. ఆ షోలో రష్మి, రాంప్రసాద్‌తో చేసిన హంగామా విశేషంగా ఆకట్టుకొంటున్నది.

టెలివిజన్ ఇండస్ట్రీలో కరోనా విజృంభణ
లాక్‌డౌన్ తర్వాత టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా మంది తారలు, నటులు కరోనావైరస్ బారిన పడ్డారు. నవ్యస్వామి, రవికృష్ణ, సాక్షి శివ, భరత్వాజ్, హరికృష్ణ లాంటి వాళ్లు కరోనాను జయించారు. అయితే సుధీర్‌కు నిజంగానే కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందా అనే విషయంపై అధికారికంగా క్లారిటీ లేకపోవడంతో తన శ్రేయోభిలాషులు ఆందోళనకు గురవుతున్నారు.
Recommended Video

సుడిగాలి సుధీర్‌తో పనిచేసిన టీమ్స్ పరిస్థితి..
ఒకవేళ సుడిగాలి సుధీర్‌కు కరోనా సోకినట్లయితే.. గత కొద్ది రోజులుగా ఆయన పాల్గొన్న షూటింగ్స్ యూనిట్ కూడా రిస్క్‌లో పడినట్టే అనే మాట వినిపిస్తున్నది. తనతోపని చేసిన వాళ్లందరూ రోగ నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం, స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











