jabardasth సుడిగాలి సుధీర్ బడా హీరోగా మారడానికి మరో బిగ్ స్కెచ్.. లోడింగ్ అంటూ స్పెషల్ పోస్ట్!
మొదట ఒక మిమిక్రి ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సుధీర్ ఆ తరువాత జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. అనంతరం బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను మఞ్చగి టాలెంటెడ్ యాక్టర్ అని జనాల చేత పాజిటివ్ కామెంట్స్ అందుకున్నాడు.
అలాగే సుధీర్ ఇప్పుడు సినిమా హీరోగా కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఒక సినిమాతో అతను మాస్ హీరోల రేంజ్ లో అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకున్నాడు ఇప్పుడు అదే తరహాలో కొనసాగాలని మరొక సినిమాతో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

అలా క్రేజ్ అందుకుంటూ..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా నటుడిగా ఎంత పాపులర్ అయ్యాడో, అదే సమయంలో యాంకర్ రష్మితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ద్వారా కూడా సుదీర్ పాపులర్ అయ్యాడు. ఇక నటుడిగానే కాకుండా గాయకుడుగా కూడా సుదీర్ బుల్లితెరపై సందడి చేశాడు. అలాగే తన మ్యాజిక్ షోలతో ఆకట్టుకున్నాడు.
కమెడియన్ నుంచి హీరోగా..
ఇలా మల్టీ టాలెంటెడ్ గా అనిపించుకున్న సుధీర్ బుల్లితెర నుంచి నటుడిగా వెండితెరపైన కూడా చిన్న చిన్న పాత్రలతో కమెడియన్ గా మెప్పించారు. తరువాత సాఫ్ట్ వేర్ సుదీర్ అనే సినిమాతో హీరోగా తనని తాను షోకేస్ చేసుకున్నాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయితే గత ఏడాది గాలోడు మూవీ కొంత వారము ప్రజలకి రీచ్ అయ్యింది.

మరో సినిమా లోడింగ్
యావరేజ్ టాక్ తెచ్చుకున్న గాలోడు మూవీ సుదీర్ కి హీరోగా మాత్రం ఇమేజ్ తీసుకొచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరొక్క సినిమాని సుదీర్ ఎనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా సుదీర్ ట్విట్టర్ లో డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేసి లోడింగ్ అని పోస్ట్ పెట్టారు. అందుకు సంబంధించిన ఫొటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ మరో అద్భుతమైన అప్డేట్ ఎదో ఇవ్వబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఆ రేంజ్ లో బడ్జెట్
దీనిని బట్టి తన నెక్స్ట్ సినిమా రెడీ అయిపోతుంది అని క్లారిటీ ఇచ్చాడనే మాట వినిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేశారు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలపై మాత్రం సుదీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ టాక్ ప్రకారం ఆ సినిమా కూడా మాస్ యాక్షన్ తరహాలోనే ఉంటుందట. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారాని కూడా టాక్ మొదలైంది.

మళ్ళీ టెలివిజన్ లో కూడా..
ఇక హీరోగా తనని తాని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సుదీర్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మళ్ళీ బుల్లితెరపైకి కూడా రీఎంట్రీ ఇచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీలోకి మళ్ళీ అడుగుపెట్టారు. ఇక జబర్దస్త్ లోకి కూడా రీఎంట్రీ ఇస్తాడని అందరూ అభిమానులు అందరూ ఆశిస్తున్నారు. మరి ఇది సాధ్యం అవుతుందా అనేది చూడాలి. మరో వైపు కొత్త సినిమా విశేషాల కోసం సుదీర్ ని సోషల్ మీడియాలో అభిమానులు మెసేజ్ లు పెట్టి అడుగుతూ ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











