ఈటీవీ, మల్లెమాల ప్రోగ్రాంలో ట్విస్ట్.. అనసూయ, సుధీర్ ఎంట్రీ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

తెలుగు బుల్లితెర చరిత్రతో ఈటీవీది స్వర్ణయుగం. స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఉంది.ఎన్నెన్నో షోలు, ఎన్నెన్నో సుధీర్ఘ ధారావాహికలు నిర్మించి సంచలనాలు సృష్టించింది. ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది ఈ టీవీ. బుల్లితెరపై ఏదైనా కొత్తగా ఆలోచించాలన్నా.. కొత్త షో చేయాలన్నా.. ప్రయోగాలు చేయాలన్నా కూడా ఈటీవీ ముందుంటుంది. అందులో మల్లెమాల అయితే మరింత దూకుడుగా ఉంటుంది. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో మల్లెమాలను మించిన సంస్థ మరొక్కటి లేదు. తాజాగా జబర్దస్త్ షో వివాదాల మధ్య తాజాగా భలే మంచి రోజు ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 27వ వార్షికోత్సవం..

27వ వార్షికోత్సవం..

ఇక ఇప్పుడు ఈటీవీ 27వ వసంతంలోకి అడుగుపెట్టేసింది. ఇందుకోసం మల్లెమాల స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇందులో మల్లెమాల ఎన్నెన్నో చమక్కులు, ట్విస్టులు ఇచ్చింది. ఈటీవీ వల్ల లబ్ది పొందిన వారిని అందరినీ పిలిచినట్టు కనిపిస్తోంది. ఇక మల్లెమాలను వీడిపోయిన ఎంతో మంది కూడా మళ్లీ ఈ ఈవెంట్‌కు వచ్చినట్టు కనిపిస్తోంది.

జబర్దస్త్ గ్యాంగ్..

జబర్దస్త్ గ్యాంగ్..

జబర్దస్త్ షో ద్వారా అనసూయ, సుధీర్,చమ్మక్ చంద్ర వంటి వారు ఎంతగానో పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర అనే ట్యాగులు ఇచ్చింది కూడా ఆ షోనే. ఇప్పుడు అనసూయ, సుధీర్, చంద్రలు ఈటీవీ గానీ మల్లెమాలలో గాని పని చేయడంలేదు. వీరంతా కూడా స్టార్ మా చానెళ్లో పని చేస్తున్నారు.

రకరకాల కారణాలు..

రకరకాల కారణాలు..


అనసూయ, సుధీర్, చంద్ర ఇలా అందరూ కూడా రకరకాల కారణాలతో బయటకు వెళ్లారు. చంద్ర అయితే గతంలోనే వెళ్లిపోయాడు. నాగబాబు బయటకు వచ్చినప్పుడే చంద్ర కూడా వచ్చేశాడు. సుధీర్ ఈ మధ్యే వచ్చేశాడు. అతను ఎందుకు బయటకు వెళ్లాడన్నది ఇప్పటికీ తేలడం లేదు. అనసూయ అయితే ఏవేవో కారణాలు చెబుతోంది. వాటిలో ఎవ్వరికీ ఏం అర్థం కావడం లేదు.

రీ ఎంట్రీ..


ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురూ కూడా మల్లెమాల ఈవెంట్‌లో కనిపించారు. భలే మంచి రోజు అంటూ ఈటీవీ 27వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో దాదాపు అతిరథ మహారథులంతా వచ్చారు. కే రాఘవేంద్రరావు నుంచి ఎస్పీ చరణ్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు జబర్దస్త్ గ్యాంగ్ కూడా రావడంతో వేదికంతా కళకళలాడింది.

ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..


ఇక సుధీర్ ఇలా మళ్లీ మల్లెమాల ఈవెంట్‌లో కనిపించడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. సుధీర్ ఎంట్రీ స్టైల్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్, అన్నొచ్చిండు అంటూ ఇలా ఫ్యాన్స్ యూట్యూబ్‌లో సందడి చేస్తున్నారు. అనసూయ ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇక చమ్మక్ చంద్ర సత్య శ్రీల స్పెషల్ పర్ఫామెన్స్ కూడా ప్రోమోలో హైలెట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X