సస్పెన్స్‌కు చెక్ .. గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి తర్వాత యాంకర్‌గా, హీరోగా స్థిరపడ్డారు సుడిగాలి సుధీర్. ఒకప్పుడు మేజిక్ షోతో జీవితం ప్రారంభించిన సుధీర్ తన కష్టంతో ఇక్కడి వరకు వచ్చారు. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న సుధీర్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే 40కి చేరువు అవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అంతా పెళ్లెప్పుడని అడుగుతూనే ఉన్నారు. మీడియాలో అయితే ఖచ్చితంగా సుధీర్ పెళ్లి ఓ హాట్ టాపిక్కే. ఈ నేపథ్యంలో సుధీర్ ఫ్యామిలీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వివరాల్లోకి వెళితే..

మేజిక్ షోలతో కెరీర్ ప్రారంభం

చాలా తక్కువ సమయంలోనే బుల్లితెరపై స్టార్‌గా ఎదిగిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు తొలుత మ్యాజిక్ షోలు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభించాడు. పలు ఛానెల్స్‌లో తన ట్రిక్స్ చూపిస్తూ గేమ్ షోలలో పార్టిసిపేట్ చేశాడు. ఈ దశలో జబర్దస్త్ కార్యక్రమం సుధీర్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. వేణు వండర్స్ టీమ్ ద్వారా ఈ మెగా షోలోకి అడుగుపెట్టిన సుధీర్.. షార్ట్ గ్యాప్‌లోనే టీమ్ లీడర్ స్టాయికి ఎదిగాడు. తన ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌లతో కలిసి తన స్కిట్‌లతో జనాన్ని కడుపుబ్బా నవ్వించాడు.

jabardasth fame sudigali sudheer brother rohan reveled good news

సుధీర్ జీవితానికి ప్లస్‌గా రష్మీ గౌతమ్

తన టాలెంట్‌తోనే కాకుండా మరో విషయంలోనూ సుడిగాలి సుధీర్ బాగా పాపులర్ అయ్యాడు. అదే రష్మి గౌతమ్‌తో లవ్ ట్రాక్. జబర్దస్త్ కోసం పదే పదే రష్మి- సుధీర్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా చూపించడంతో జనంలో ఈ జోడీకి విపరీతమైన క్రేజ్ దక్కింది. సుధీర్ కెరీర్‌కు మాత్రం రష్మి గౌతమ్ బాగా హెల్ప్ అయ్యారు. జబర్దస్త్‌లో చేస్తున్న సమయంలోనే సుధీర్‌కు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. రేసుగుర్రం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత సుధీర్‌కు ఏకంగా సినిమాల్లో హీరో ప్లేస్ దక్కింది. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. తర్వాత త్రీమంకీస్, కాలింగ్ సహస్రా, గాలోడు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. సుధీర్ క్రేజ్‌తో ఈ సినిమాలకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి.

బాగానే కూడబెడుతున్న సుధీర్

సుధీర్ టాలెంట్ దృష్ట్యా ఆయనకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటు పలు ఛానెల్స్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. షోలు, సినిమాలు, ఇతర ఈవెంట్స్ ద్వారా సుధీర్ నెలకు రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నాడని ఫిలింనగర్ టాక్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బాగానే సంపాదించిన సుధీర్ హైదరాబాద్‌లో ఖరీదైన ఇంటిలోకి షిఫ్ట్ అయ్యారు. ఆయన ఆస్తుల విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుదని బుల్లితెర వర్గాలు చెబుతుంటాయి. ఇలా కెరీర్‌పరంగా పీక్స్‌లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడంతో ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Take a Poll

గుడ్‌న్యూస్ చెప్పిన సుధీర్ తమ్ముడు

తాజాగా సుడిగాలి సుధీర్ కుటుంబ సభ్యులు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. సుధీర్ తమ్ముడు రోహన్‌కు కొడుకు పుట్టాడు. ఈ మేరకు రోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. సుధీర్ తమ్ముడు రోహన్ అతని భార్య రమ్యలు హైదరాబాద్‌లోనే ఉంటుండగా, చెల్లెలు మాత్రం తన భర్తతో కలిసి ఫారిన్‌లో సెటిలయ్యారు. సుధీర్‌ ఇంట్లోకి వారసుడు రావడంతో అతని కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. ఇదంతా బాగానే ఉంది కానీ సుధీర్ పెళ్లి విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X