Bigg Boss 7 Telugu: షోలోకి జబర్ధస్త్ మాజీ కమెడియన్.. ఇండియాలోనే ఒకే ఒక్కడు.. ఇంతకీ ఎవరీ టేస్టీ తేజ?

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో నడిచే ఈ షో.. ఎన్నో ఊహించని సంఘటనలతో సాగుతుంది. దీంతో తెలుగు షోకు రికార్డు స్థాయి రేటింగ్‌ కూడా దక్కుతోంది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇందులోకి తాజాగా జబర్ధస్త్ మాజీ కమెడియన్ టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చాడు. అతడి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా!

జోష్‌తో మొదలైన ఏడో సీజన్:బిగ్ బాస్ షోపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని ఏమాత్రం తగ్గించకుండా వరుసగా సీజన్లను తీసుకు వస్తున్న నిర్వహకులు ఇప్పుడు ఏడో దాన్ని కూడా ప్రారంభించారు. ఈరోజే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రీమియర్ ఎపిసోడ్ ప్రసారం అవుతోంది. ఇందులో కంటెస్టెంట్ల ఆటపాటు, సెలెబ్రిటీల ఎంట్రీలతో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

Jabardasth Fame Tasty Teja Entered into Bigg Boss 7 Telugu Show

టిస్టులు, సర్‌ప్రైజ్‌లు, టాస్క్:బిగ్ బాస్ గత సీజన్ ఫ్లాప్ అవడంతో ఏడో దాన్ని సూపర్ సక్సెస్ చేయాలని నిర్వహకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, టాస్కులు ఇస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే సరికొత్త కాన్సెప్టు కనిపిస్తోంది. ఫలితంగా ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ లాగింది.

తొమ్మిదో కంటెస్టెంట్‌గా తేజ:ఎంతో వైభవంగా జరుగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌‌లోకి కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎనిమిది మంది హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే తొమ్మిదో కంటెస్టెంట్‌గా జబర్ధస్త్ మాజీ కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ ఎంటర్ అయ్యాడు. ఇతడు మాత్రం తనదైన కామెడీని చూపించే ఏవీ ప్రదర్శన అనంతరం వచ్చాడు.

Jabardasth Fame Tasty Teja Entered into Bigg Boss 7 Telugu Show

టేస్టీ తేజ అంటే ఎవరంటే:ఇప్పుడు టేస్టీ తేజగా ఫేమస్ అయిన ఇతగాడు చాలా కాలం క్రితమే జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా సందడి చేశాడు. అందులో పలు టీమ్‌లలో పని చేసి ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత ఆ షోకు గ్యాప్ ఇచ్చిన అతడు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఈ క్రమంలోనే ఫుడ్ వీడియోలు చేస్తూ యూట్యూబర్‌గా మారాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే సెన్సేషన్‌గా మారాడు.

ఇండియాలోనే ఒకే ఒక్కడు:ఈ మధ్య కాలంలో టేస్టీ తేజ తన యూట్యూబ్ ఛానెల్‌లో సినిమా ప్రమోషన్లు కూడా చేస్తున్నాడు. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి వచ్చిన 150కి పైగా సినిమాలకు అతడు తన యూట్యూబ్‌‌ ఛానెల్‌లో ప్రచారం చేశాడు. తద్వారా ఇలా ఎక్కువ సినిమాలకు వర్క్ చేసిన ఏకైక ఫుడ్ యూట్యూబర్‌గా టేస్టీ తేజ నేషనల్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

కామెడీతో మెప్పిస్తూ ఫోకస్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే టేస్టీ తేజ తనదైన కామెడీతో అలరించాడు. దీంతో ఆరంభంలోనే అతడు ప్రేక్షకుల దృష్టిలో పడిపోయాడు. ఫలితంగా ఫస్ట్ ఇంప్రెషన్‌తో అతడు మంచి పేరును కూడా తెచ్చుకున్నాడు. ఇది రాను రానూ అతడి బిగ్ బాస్ జర్నీకి ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X