అనసూయ గురించి తెలియక అలా మాట్లాడాను.. తప్పు నాదే.. నాటి వీడియోపై వర్ష క్లారిటీ

జబర్దస్త్ వేదికపై ఈ మధ్య తళుక్కుమని మెరిసిన అందం వర్ష. ఆ మధ్య హైపర్ ఆది స్కిట్‌లో మెరిసింది. మధ్యలో ఇమ్మాన్యుయల్ జతగా స్కిట్స్ వేసింది. రీసెంట్‌గా రాకింగ్ రాకేష్ స్కిట్‌తో నడుము అందాలను ప్రదర్శిస్తూ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఇమ్మాన్యుయల్‌తో కలిసి చేసే స్కిట్‌లో మాత్రం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటూ రోజా కూడా ఫుల్ సెటైర్లు వేయడంతో వర్ష బాగానే పాపులార్టీ తెచ్చుకుంది.

బుల్లితెరపై ఫేమస్..

బుల్లితెరపై ఫేమస్..

అయితే వర్ష ఇంతకుముందు.. అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర వంటి సీరియల్స్‌లో నటించింది. అయితే ఎన్ని సీరియళ్లు చేసినా రాని గుర్తింపు క్రేజ్ ఫేమ్ జబర్దస్త్ వల్ల వచ్చింది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్డంను ఎంజాయ్ చేసింది. ఈ స్టార్డం కొన్ని తలనొప్పులు కూడా తీసుకొచ్చింది.

నాటి వీడియో..

నాటి వీడియో..

ఇలా వర్ష ఫేమస్ అయిందో లేదో.. ఆమె గతంలో మాట్లాడిన వీడియోలను మళ్లీ వైరల్ చేయసాగారు. ఓ సారి అనసూయ ఓ సందర్భంలో సెల్ఫీ అడిగాడని ఓ అబ్బాయి ఫోన్‌ను పగలగొట్టిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అది దాదాపు మూడు నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటన. ఈ ఘటనపై వర్ష అప్పట్లో ఓ వీడియో విడుదల చేసింది. అందులో అనసూయను ఘోరంగా అవమానించింది.

అనసూయను ఏకిపారేసింది..

అనసూయను ఏకిపారేసింది..

వర్ష ఆ వీడియోలో మాట్లాడుతూ అనసూయను ఏకిపారేసింది. తనకి కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్లు ఎవరితోనైనా పెద్ద హీరోలతో సెల్ఫీ దిగాలని ప్రయత్నిస్తే వారి ఫోన్‌ను కూడా అలా పడేస్తే ఆమె ఎంతలా ఫీలవుతుందో.. అవతలి వ్యక్తి కూడా అంతే ఫీలవుతారు కదా అనసూయ పరువు తీసేలా మాట్లాడింది. అయితే ఆ వీడియో ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతుండటంతో దానిపై క్లారిటీ ఇచ్చేందుకు లైవ్ లోకి వచ్చింది.

 రంగస్థలం షోలో..

రంగస్థలం షోలో..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో వర్ష దృష్టికి వెళ్లినట్టుంది. అందుకే చెప్పా పెట్టకుండా లైవ్‌లోకి వచ్చింది దానికి క్లారిటీ ఇచ్చింది. "అప్పుడు అనసూయ గురించి తెలియకుండా మాట్లాడేశాను. రంగస్థలం షో చేస్తున్నప్పుడు అనసూయతో మాట్లాడాను. క్షమాపణలు చెప్పాను. అనసూయ చాలా కూల్‌గా మాట్లాడింది.. నా గురింరి తెలియక అలా మాట్లాడావ్ కదా అని లైట్ తీసుకుందని వర్ష చెప్పుకొచ్చింది.

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
తప్పు నాదే..

తప్పు నాదే..

అనసూయ చాలా మంచింది.. నాకు ఎంతో సాయం చేసింది.. నాకే కాదు చాలా మందికి సాయం చేసింది. అప్పుడు అనసూయను అలా అనడంలో నాదే తప్పు ఉంది.. ఏమీ తెలియకుండా మాట్లాడేశాను.. ఆ విషయంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను సారీ అంటూ వర్ష క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X