పవన్ కల్యాణ్‌కు ఓటు వేయడానికి ఖండాలు దాటోస్తున్న కుర్రాళ్లు .. గెటప్ శ్రీను వీడియో వైరల్

మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ రాజకీయాలపై నేటి యువతకు వున్న దురభిప్రాయం, అనాసక్తి వంటి కారణాలతో చాలా మంది ఓటు వేయడాన్ని లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆ రోజున సెలవు దినంగా ప్రకటిస్తే.. కుటుంబంతో గడిపేందుకు , లేదంటే ఏదైనా వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటును తప్పనిసరి చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఓటు వేయని వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.

పక్కనున్న పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకే ఇష్టపడని జనం వుంటే.. ఓటు వేసేందుకు ఖండాంతరాలు దాటొస్తున్నారని కొందరు కుర్రాళ్లు. ఈ విషయాన్ని జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను పంచుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు స్పూర్తినిచ్చే సంఘటన జరిగిందని చెబుతూ.. ఓటు వేయడానికి విదేశాల నుంచి వస్తున్న కుర్రాళ్లని చూపించారు. పూరుజ్ అనే యువకుడు కెనడా నుంచి ఓటేయ్యడానికి ఇండియాకు వస్తున్నట్లు తెలిపారు. ప్రూఫ్‌లు ఏమైనా వున్నాయా అని శ్రీను అడగ్గా.. పూరుజ్ ఫ్లైట్ టికెట్లు చూపించారు. ఎడ్మంటన్ టూ అమ్‌స్టార్‌డామ్ .. అమ్‌స్టార్‌డామ్ టూ ఢిల్లీ.. ఢిల్లీ టూ హైదరాబాద్ మీదుగా తాను జర్నీ చేసినట్లు ఆయన తెలిపారు.

jabardasth Getup Srinu appeals to the voters for casting vote video goes viral

మరో యువకుడు తాను అమెరికా నుంచి ఓటు వేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. మయామీ టూ లండన్.. లండన్ టూ ఢిల్లీ, ఢిల్లీ టూ హైదరాబాద్ మీదుగా ఇక్కడికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. వీరిద్దరిని అభినందించిన గెటప్ శ్రీను.. ఇండియాలో పొరుగు రాష్ట్రాల్లో వుంటూ ఓటు వేయడానికి రాని వారు వీళ్లని చూసి నేర్చుకోవాలని సూచించారు. మే 13న ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుని మన బాధ్యతను నిర్వర్తించాలని గెటప్ శ్రీను హితవు పలికారు.

కాగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు గెటప్ శ్రీను. అతని సహచరులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పవన్‌కు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. తమను ఎవరూ ప్రచారానికి ఆహ్వానించలేదని.. మాకు మేమే స్వచ్ఛందంగా వచ్చినట్లు శ్రీను తెలిపారు. పవన్‌పై ఇష్టంతో, ఆయన గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.

రోజా తమను చిన్న ప్రాణాలని అంటున్నారని ఆవిడ మాటలను చిన్న కామెంట్స్‌గానే తీసుకుంటామన్నారు. జనసేన నుంచి తమకు డబ్బు అందిందన్న వ్యాఖ్యలకు కూడా శ్రీను స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వారికి తమ అకౌంట్ నెంబర్లు ఇస్తామని.. కావాలంటే చెక్ చేసుకోవచ్చని గెటప్ శ్రీను సవాల్ విసిరారు. మెగా ఫ్యామిలీ చెప్పినట్లు చేయకుంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారన్న ఆరోపణలకు కూడా శ్రీను స్పందించారు. తాను ఒక్క విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్, నాని లాంటి స్టార్స్‌తోనూ నటించినట్లు ఆయన వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X