Jabardasth : గెటప్ శ్రీను దెబ్బ.. పాపం బకరా అయిన ఏడుకొండలు.. అసలు ట్విస్ట్ అదిరిందిగా!

జబర్దస్త్ షోలో అనేక వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి చాలా మంది కమెడియన్లు బయటికి వెళ్లిపోయి కొంత మంది ఇతర షోలు చేసుకుంటుంటే మరి కొంతమంది సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా జరిగిన ఎపిసోడ్స్ గమనిస్తే నాగబాబు మనిషిగా పేరు తెచ్చుకున్న ఆర్పి జబర్దస్త్ షో మీద కొన్ని ఆరోపణలు చేయడంతో హైపర్ ఆది, రాంప్రసాద్ తో పాటు ఎప్పుడో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఏడుకొండలు కూడా వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఏడుకొండలు ప్రయత్నాలు విఫలమైనట్లే కనిపిస్తున్నాయి.. ఆ వివరాల్లోకి వెళితే

నిజం కాదని

నిజం కాదని


కొద్దిరోజుల క్రితం నాగబాబుకు అతి వీర అభిమానిగా పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పి జబర్దస్త్ మీద ఆ మల్లెమాల సంస్థ నిర్వాహకుల పైన అనేక ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో జబర్దస్త్ లో ప్రస్తుతం కొనసాగుతున్న హైపర్ ఆది, రాంప్రసాద్ వంటి వారు వచ్చి అది నిజం కాదని ఖండించే ప్రయత్నం చేశారు.

వెళ్లి మాట్లాడుతా

వెళ్లి మాట్లాడుతా

అయితే జబర్దస్త్ నుంచి మల్లెమాల సంస్థ నుంచి చాలా కాలం క్రితమే బయటకు వెళ్లిపోయిన ఏడుకొండలు కూడా స్వయంగా తాను మీడియా ఛానల్ కి ఫోన్ చేసి తానే ఇంటర్వ్యూ ఇచ్చి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కలిపి తిట్టడమే కాక వారందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని వాళ్లందరినీ వెనక్కి రప్పిస్తానని శ్యాం ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్లి మాట్లాడుతాను అంటూ బీరాలు పలికారు.

 బిల్డప్ బాబాయ్

బిల్డప్ బాబాయ్


ఆ ఇంటర్వ్యూలో గెటప్ శ్రీనుకు తన కారు ఇచ్చేశాను అంటూ ఆయన కామెంట్స్ చేసిన నేపథ్యంలో అసలు తాను సృష్టించిన బిల్డప్ బాబాయ్ అనే క్యారెక్టర్ ఏడుకొండలను ఉద్దేశించే చేశాను అంటూ అప్పట్లో పోస్టులు పెట్టాడు గెటప్ శ్రీను. తర్వాతే ఏమనుకున్నాడేమో వాటిని డిలీట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే బిల్డప్ బాబాయ్ గెటప్ తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రోమో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.

జబర్దస్త్ లోకి ఎంట్రీ

జబర్దస్త్ లోకి ఎంట్రీ


ఎలాగో వెళ్లే వాళ్ళు బయటకు వెళ్తున్నారు ఈ అవకాశాలను వాడుకొని మళ్ళీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఏడుకొండలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని ఒకరకంగా ఆయన అటు ఇటు కాకుండా బకరా అయిపోయాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఏడుకొండలు ఏ ఉద్దేశంతో బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడో తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం తాను జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసమే ప్రయత్నం చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సుధీర్ కూడా

సుధీర్ కూడా


ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే గెటప్ శ్రీను నేను పలానా క్యారెక్టర్ సృష్టించాను అని పోస్ట్ పెట్టాడో అదే క్యారెక్టర్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇప్పించడం అంటే ఒక రకంగా ఏడు కొండలను పక్కన పెట్టడానికి మల్లెమాల సంస్థ ఇలా చేయించింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కొన్ని రోజుల్లో సుధీర్ కూడా రీ ఎంట్రీ లేదా గెస్ట్ ఎంట్రీ ఇచ్చి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని మల్లెమాల గురించి ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా అందులో ఆశ్చర్యం లేదంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X