For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Getup Srinu: రోజాపై గెటప్ శ్రీను సంచలన పోస్ట్.. అవి కనిపించడం లేదా అని.. రాత్రికి రాత్రే మిస్సింగ్!

  |

  ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతోన్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోన్నారు. అందులో పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా తన గొంతును వినిపిస్తూ ప్రత్యర్థులపై విమర్శలతో చెలరేగిపోతోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మెగా బ్రదర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వాళ్ల అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతోన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గెటప్ శ్రీను మంత్రి రోజాపై సంచలన పోస్ట్ చేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  మెగా ఫ్యామిలీపై రోజా కామెంట్

  మెగా ఫ్యామిలీపై రోజా కామెంట్

  ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లపై కామెంట్స్ చేశారు. 'పవన్‌కు అసలు మానవత్వం లేదు. ఎమోషన్స్ లేవు. ఆయన నా తోటి ఆర్టిస్టు అయినందుకు సిగ్గుపడుతున్నాను. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటోళ్లు తమకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన ప్రజలకు సీఎంలు అయి సేవ చేశారు' అన్నారు.

  జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

  వాళ్లకు భవిష్యత్ లేదంటూనే

  వాళ్లకు భవిష్యత్ లేదంటూనే

  అదే ప్రెస్‌మీట్‌లో రోజా మాట్లాడుతూ 'చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు తమను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు చిన్న సహాయం చేయలేదు. అంతెందుకు వీళ్లు ముగ్గురూ సొంత జిల్లాకు ఏమీ చేయలేదు. అందుకే అన్నదమ్ముల ముగ్గురినీ సొంత నియోజకవర్గ ప్రజలే ఓడించారు. రాజకీయాల్లో ఈ ముగ్గురికి అసలు భవిష్యత్ అనేది లేదు' అంటూ వ్యాఖ్యలు చేశారు.

  సైనికులు, ఫ్యాన్స్ ఆగ్రహంగా

  సైనికులు, ఫ్యాన్స్ ఆగ్రహంగా

  ఏపీ మినిస్టర్ రోజా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అటు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆమెకు స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మెగా బ్రదర్ నాగబాబు సైతం రోజా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

   చిరంజీవిని ఎందుకు లాగారు

  చిరంజీవిని ఎందుకు లాగారు

  రోజా చేసి కామెంట్లపై చాలా వ్యతిరేకత వస్తోంది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పవన్, నాగబాబును విమర్శించినా అర్థం ఉంటుంది కానీ.. ఇప్పుడు రాజకీయాల్లోనే లేని చిరంజీవిని ఆమె ఎందుకు లాగారాని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్‌ సిలెండర్లు, కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ వంటివి చేశారని గుర్తు చేస్తున్నారు.

  రోజాపై గెటప్ శ్రీను కామెంట్స్

  రోజాపై గెటప్ శ్రీను కామెంట్స్

  మెగా బ్రదర్స్‌పై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆమెతో ఎంతో సన్నిహితంగా ఉండే జబర్ధస్త్ కమెడియన్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు అతడి ఫేస్‌బుక్‌లో 'చిరంజీవి గారు.. సేవా గుణం, దాన గుణంతో కూడిన తెరిచిన పుస్తకం.. ఆయన ఎందరికో ఒక స్ఫూర్తి. మరి అది మీకెందుకు కనపడలేదో మరి? రోజా గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి' అంటూ అతడు పోస్ట్ చేశాడు.

  నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

  ఉనికి కోసం అలా చేయొద్దు

  ఉనికి కోసం అలా చేయొద్దు

  అదే పోస్టులో గెటప్ శ్రీను 'మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీద ఉన్న గౌరవాన్ని మాత్రం కోల్పోకండి. మీ నోట నుంచి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని అసలు అనుకోనేలేదు. దయ చేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి' అంటూ రోజాను డిమాండ్ చేశాడు. ఇక, గెటప్ శ్రీను చేసిన వ్యాఖ్యలకు మెగా అభిమానులు నుంచి మద్దతు లభిస్తోంది.

  రాత్రికి రాత్రే పోస్ట్ మిస్సింగ్

  రాత్రికి రాత్రే పోస్ట్ మిస్సింగ్

  మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులపై రోజా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గెటప్ శ్రీను చేసిన పోస్టు చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది. అలాంటిది ఫేస్‌బుక్‌లో ఈ పోస్టు రాత్రికి రాత్రే మిస్ అయింది. దీంతో గెటప్ శ్రీను దీన్ని డిలీట్ చేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఇక, ఈ పోస్టు కనిపించకపోవడంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  English summary
  Andhrapradesh Cabinet Minister Roja Did Sensational Comments On Mega Heroes. Now Jabardasth Getup Srinu Puts Sensational Post on Her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X