పవన్ కల్యాణ్ గొప్పతనం అదీ.. చదివిస్తానంటే పారిపోయా.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

జబర్దస్త్ కామెడీ షోలో అద్భుతమైన టాలెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న కమెడియన్లలో జబర్దస్త్ హరికృష్ణ ఒకరు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించారు. బతుకు తెరువు కోసం కష్టాలు పడుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాను. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో ఎదురైన ఓ సంఘటన గురించి చెబుతూ..

బుల్లితెరపై.. జూనియర్ ఆర్టిస్టుగా

బుల్లితెరపై.. జూనియర్ ఆర్టిస్టుగా

బుల్లితెరపై డ్యాన్స్ షోలు, ఇతర కార్యక్రమాల్లో నటించాను. అవకాశాలు సరిగా రాకపోవడంతో జూనియర్ ఆర్టిస్టుగా నటించాలని కృష్ణానగర్‌లో కొందరిని కలిశాను. అప్పుడు ఉదయం 4 గంటలకే రమ్మని చెప్పేవాళ్లు. నేను ఫతేనగర్ నుంచి తెల్లవారు జామున నడుచుకొంటూ కృష్ణా నగర్‌కు వచ్చే వాడిని. కొన్నిసార్లు డబ్బులు ఇచ్చేవారు. మరికొన్నిసార్లు ఇచ్చేవారు కాదు. అయినా నటించాలనే కోరికతోనే పలు సినిమాల్లో నటించాను అని హరికృష్ణ తెలిపారు.

పవన్ కల్యాణ్ సినిమా షూట్‌లో

పవన్ కల్యాణ్ సినిమా షూట్‌లో

అలా జూనియర్ ఆర్టిస్టుగా నటించే సమయంలో పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఓ పాట షూటింగ్ సందర్భంగా పవన్ కలిసే ప్రయత్నం చేశాను. షూటింగ్ గ్యాప్‌లో పవన్ కల్యాణ్ కుర్చీలో కూర్చొంటే నమస్తే సార్ అన్నాను. అందుకు పవన్ మీరు విజిటరా అని అడిగారు. అయితే నాకు అంతగా తల ఊపడంతో అడ్డదిడ్డంగా తల ఊపాను. ఫోటో దిగుతావా అంటే ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను అని జబర్దస్త్ హరికృష్ణ చెప్పారు.

పవన్ నన్ను పిలిచి ప్రశ్నిస్తే

పవన్ నన్ను పిలిచి ప్రశ్నిస్తే

అయితే మళ్లీ షూటింగ్ మొదలు కావడంతో నేను వెళ్లి సీన్‌లో పాల్గొన్నాను. అప్పుడు పవన్ నా వంక అదోలా చూసి తల తిప్పుకొన్నారు. ఆ తర్వాత షాట్‌ గ్యాప్ రావడంతో పవన్ కల్యాణ్ మళ్లీ తన సీటులో కూర్చొన్నారు. ఆయన ముందు నుంచి వెళ్తుంటే జూనియర్ ఆర్టిస్టువా అని అడిగారు. నిన్ను ఎవరు తీసుకొచ్చారు? ఆ చదువుకోలేదా అంటూ పవన్ ప్రశ్నిస్తే.. తాము పేదవాళ్లమని పవన్‌కు చెప్పానని హరికృష్ణ తెలిపారు.

నన్ను దగ్గరగా తీసుకొని..

నన్ను దగ్గరగా తీసుకొని..

పవన్ కల్యాణ్ చూసి నేను భయపడి పోయాను. దాంతో నేను భయపడుతున్నాననే విషయాన్ని గుర్తించి.. నన్ను దగ్గరగా తీసుకొని చెవి పట్టుకొని చిన్నగా గిల్లాడు. చెవిని ప్రేమగా మెలిపెడుతూ చదువుకోవాలని చెప్పారు. చదువు కొంటే కష్టాలు తీరుతాయి. చదువుకు తగిన సహకారం అందిస్తానని చెప్పారు. అప్పుడు పవన్ కల్యాణ్ అలా అనడంతో నాకు ఏదో గాబరపడ్డాను అని హరికృష్ణ చెప్పారు.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
పవన్ కల్యాణ్‌ను కలువు

పవన్ కల్యాణ్‌ను కలువు

ఆ తర్వాత పవన్ కల్యాణ్ వెంటనే షూటింగ్ అయిపోయిన తర్వాత నన్ను కలువమని చెప్పారు. చదువుకోంటే మంచి భవిష్యత్ ఉంటుంది. చదువు కోసం నేను ఏర్పాట్లు చేస్తాను. షూటింగ్ తర్వాత నన్ను కలువమని చెప్పారు. దాంతో నాకు చెమటలు పట్టేశాయి. ఆ తర్వాత షూటింగ్ అయిపోగానే పవన్ కళ్యాణ్‌ను కలువాల్సి వస్తుందని గబగబా వెళ్లిపోయాను అని హరికృష్ణ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X