100 మొబైల్ రీఛార్జ్ చేయి.. మోసానికి గురైన హైపర్ ఆది

హైపర్ ఆది తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవ్వరికీ ఆ ఒక్కటి మాత్రం ఇవ్వద్దు అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఇంతకీ ఆది ఏ విషయం గురించి ఈ కామెంట్స్ చేశారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ మనం కూడా తెలుసుకుందాం.

హైపర్ ఆది... తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ లను పెంచేశాడు ఆది. ఆ షో లవర్స్ ను తన పంచులతో కడుపుబ్బా నవ్వించిన ఆది ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి డ్యాన్స్ షోలలో కూడా తన ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలకు రచయితగా పని చేసిన ఆది క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా కూడా మెరిసాడు.

Jabardasth Hyper Aadi about Cheating in Entertainment Telugu Movie Industry

అయితే ఈ స్థాయి సక్సెస్ ను అందుకోవాలంటే ఎవ్వరికైనా అంత ఈజీ కాదు. కెరీర్ మొదట్లో ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడతారు. అవన్నీ దాటుకుని వస్తేనే ఆశించిన స్టార్ డమ్ ను అందుకోగలుగుతారు. అయితే కెరీర్ మొదట్లో సరైన గైడెన్స్ లేకపోతే ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చేవాళ్ళు పడే తిప్పలు అన్ని ఇన్ని కాదు.

హైపర్ ఆది విషయంలో కూడా అదే జరిగిందట. ఇండస్ట్రీలో ఉన్న ఎవ్వరికి అస్సలు డబ్బులు ఇవ్వకూడదు అంటూ తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో జరిగిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు ఆది.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఆది అవకాశాల కోసం ఓ ప్రొడక్షన్ హౌస్ కి వెళ్తే 3000 కట్టమని అడిగారట. అడిగినంత డబ్బులు కట్టేశాక ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెప్పారట. ఆదికి తెలియకపోవడంతో వాళ్లు అడగానే డబ్బులు, ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్లిపోయాడట.

తీరా ఉదయాన్నే తిరిగి వస్తే అక్కడ ప్రొడక్షన్ హౌజ్ లేదు. డబ్బులు కట్టించుకున్న వాళ్ళు అంతకన్నా లేరట. ఇంకేముంది మోసపోయాను అనే విషయాన్ని అర్థం చేసుకొని ఏం చేయలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడట అది. రియల్ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే, సోషల్ మీడియాలో మరోరకంగా చేదు అనుభవం ఎదురైందట ఆదికి.

ఎవరో సెలబ్రిటీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అతని కాంటాక్ట్ నెంబర్ పట్టుకొని ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని, అవకాశం ఇప్పించమని అతన్ని రిక్వెస్ట్ చేశాడట ఆది. సదరు సోషల్ మీడియా పర్సన్ వెంటనే నా ఫోన్ కి 100 రూపాయల రీఛార్జి చేయించు మాట్లాడదాం అన్నాడట. ఇలా జేబులో వంద రూపాయలు కూడా లేనివాడు సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో దిగిన ఫోటోలు పెట్టి ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చే వాళ్ళని మోసం చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఆది చెప్పుకొచ్చారు.

వీటన్నింటినీ చూశాక ఇండస్ట్రీలో ఎవ్వరికి డబ్బులు మాత్రం ఇవ్వద్దు అనే విషయం స్పష్టంగా అర్థమైందని ఈ ఇంటర్వ్యూలో ఆది వెల్లడించారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకునేవాళ్ళు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X