‘జబర్దస్త్’ నుంచి హైపర్ ఆది ఔటా?... ఇదే అదునుగా ఏం జరుగుతుందంటే!

'జబర్దస్త్' కామెడీ షోలో అతి తక్కువ కాలంలో బాగా పాపులరైన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ పంచులు, టైమింగ్ డైలాగులతో ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు ఎంటరయ్యాక మిగతా టీమ్స్ రేటింగ్స్ పరంగా వెనకపబడిపోయారనే వాదన కూడా ఉంది.

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హైప్ ఆది ఇపుడు ఈ కామెడీ షోకు దూరం అయ్యారట. గత రెండు వారాల నుంచి అతడి స్కిట్లు కూడా ప్రసారం కావడం లేదు. కెరీర్ ఇంత పీక్ స్టేజీలో ఉన్నపుడు ఆది ఎందుకు ఈ షో నుంచి వెళ్లిపోయాడనే చర్చ మొదలైంది.

రకరకాల ప్రచారం

రకరకాల ప్రచారం

ఆది ‘జబర్దస్త్' షోకు దూరం కావడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ షో ద్వారా వచ్చే సంపాదనతో అతడు సంతృప్తి పడటం లేదని, సినిమాల్లో ట్రై చేస్తున్నాడని ఇలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం కోసమా?

పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం కోసమా?

పవన్ కళ్యాణ్, జనసేన మద్దతుదారుడైన హైపర్ ఆది... ఎన్నికల సమయం కాబట్టి పూర్తి స్థాయిలో తన అభిమాన నటుడి పార్టీకి ప్రచారం చేయడానికి సమయం కేటాయించాడని, అందుకే ఈ షోకు దూరం అయ్యారనే మరో వానద కూడా ఉంది.

 ఇదే అదునుగా ఏం జరుగుతుందంటే..

ఇదే అదునుగా ఏం జరుగుతుందంటే..

అయితే హైపర్ ఆది జబర్దస్త్ షోకు ఎందుకు దూరం అయ్యాడనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా యూట్యూబ్లో వ్యూస్ కోసం జనాలను బోల్తాకొట్టిస్తూ వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. హైపర్ ఆది ఎందుకు జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడో చెప్పేసిన రైజింగ్ రాజు... అంటూ పాత వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. అయితే వీడియో మొత్తం చూసినా అందులో అసలు మ్యాటర్ లేక పోవడంతో అభిమానులు ఖంగుతింటున్నారు.

తన టీమ్‌ను బాగా చూసుకున్న హైపర్ ఆది

తన టీమ్‌ను బాగా చూసుకున్న హైపర్ ఆది

హైపర్ ఆది గురించి టీమ్ మెంబర్స్ రైజింగ్ రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతడు తన టీమ్‌ను చాలా బాగా చూసుకుంటాడని, తనతో సమానంగా నాకు డబ్బులు ఇస్తాడని, ఇతర టీమ్ మెంబర్స్‌కు డబ్బులిచ్చే విషయంలో కూడా చాలా న్యాయంగా ఆలోచిస్తాడని చెప్పుకొచ్చారు.

కోట్లు సంపాదించామనేది అవాస్తవం

కోట్లు సంపాదించామనేది అవాస్తవం

మేమిద్దరం కలిసి బయట ఈవెంట్స్ చేసుకుంటూ కోట్లు సంపాదించారని అనుకుంటారు. నెలలో 15 రోజులు ఈవెంట్స్ చేస్తున్నామని జనం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నెలలో రెండు మూడు సార్లు ఉంటాయి. ఒక్కోసారి ఉండక పోవచ్చు. సీజన్ బట్టి ఈవెంట్స్ ఉంటాయి అని రైజింగ్ రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X