ముద్దు ఇస్తే చెబుతా.. దీపిక పిల్లితో మితిమీరిన హైపర్ ఆది చిలిపి చేష్టలు

బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన షోల్లో ఢీ షో ఒకటి. ఈ షో ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ ఢీ షో... ప్రస్తుతం 16 సీజన్ నడుస్తోంది. తాజాగా ఢీ షో కోసం నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. తాజాగా ఢీ ప్రిమియర్ లీగ్ షోకు సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో వైరల్‌ గా మారాయి. ఇక తాజాగా ప్రోమో రిలీజ్ అవ్వగా... ఈ ప్రోమోలో దీపిక పిల్లపై హైపర్ ఆది రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. అంతే కాదు ఆయన చేష్టలు కూడా మీతిమీరిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే....

ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షో ప్రతివారం ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఇక లేటేస్ట్ సీజన్ కోసం నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ కోసం జట్లను ఎంపిక చేస్తున్నారు. ఈ షోకు శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు యాంకర్ ప్రదీప్ హోస్టుగా ఉండగా... దీపిక పిల్లి, హైపర్ ఆది తదితరులు మెంటర్స్‌ గా వ్యవహారిస్తున్నారు.

Jabardasth Hyper Aadi Funny Comments on Jabardasth Deepika Pilli in Dhee Premier League promo

ఇక ఈ ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా... ఆధ్యంతం కామెడీగా ఆకట్టుకుంది. నాలో ఉన్న టాలెంట్ అంతా చూపించాలని ఒక డైరెక్టర్ గా వచ్చానని హైపర్ ఆది అంటాడు. దానికి దీపిక పిల్లి ఏం సినిమాలు చేశావ్ అంటే... ముద్దు ఇస్తే చెబుతా అని అంటాడు. దీంతో దీపికా పిల్లి ఛీ అంటుంది. హే హే.. అది సినిమా పేరు అని చెప్పుకొస్తాడు హైపర్ ఆది. దీంతో ఆ మాటకు సెట్లోని వాళ్లంత నవ్వుతారు.

Jabardasth Hyper Aadi Funny Comments on Jabardasth Deepika Pilli in Dhee Premier League promo

ఇందులోకి యాంకర్ ప్రదీప్ వచ్చి ఆడిందా అంటాడు... రెండున్నర గంటలు తీశాం... మొత్తం సెన్సార్ లో పోయిందని హైపర్ ఆది అంటాడు. దీంతో మళ్లీ నవ్వులు పులుముకుంటాయి సెట్లో. ప్రదీప్ మాట్లాడుతూ... ఇంత కత్తిలాంటి డైరెక్టర్ అంటే.. కత్తి లాంటి హీరో కావాలి అంటాడు ప్రదీప్... అప్పుడే పండు ఎంట్రీ ఇస్తాడు. ఇక కొన్ని డ్యాన్స్ ప్రదర్శనలు కూడా చేస్తారు. వాటికి శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జ్ మెంట్స్ ఇస్తారు.

ఆశపాశం పాటకు ఓ టీమ్ డ్యాన్స్ ప్రదర్శన చేయగా.. శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అవుతాడు. అన్ని టీమ్ లు... అద్భతమైన డ్యాన్స్ ప్రదర్శనలతో అదరగొట్టారు. దానికి శేఖర్ మాస్టర్ తనదైన శైలీలో జడ్జ్ మెంట్స్ ఇస్తాడు. ఇక ఈ షో ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హైపర్ ఆది పంచ్ లు, దీపికా పిల్ల ఆన్సర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X