హైపర్ ఆదికి యాక్సిడెంట్.. పుకార్లపై క్లారిటీ, పరమ చెత్త అంటూ ఘాటుగా!
Recommended Video

హైపర్ ఆది పేరు చెప్పగానే జబర్దస్త్ లో కామెడీ పంచ్ లు గుర్తుకు వస్తాయి. అదిరిపోయే టైమింగ్ తో కామెడీ టైమింగ్ తో ఉండే హైపర్ ఆది స్కిట్స్ యూట్యూబ్ లో ఎప్పుడూ ట్రెండింగ్ గా ఉండే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా హైపర్ ఆది గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. జబర్దస్త్ కు ఆది పూర్తిగా దూరమయ్యాడనేది ఒక వార్త అయితే, ఇంకొన్ని పుకార్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్ల విషయంలో హైపర్ అది క్లారిటీ ఇచ్చాడు.

జబర్దస్త్‌కు దూరం
హైపర్ ఆది జబర్దస్త్షోకు దూరమయ్యాడట. దీనికి సంబంధించి అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. హైపర్ ఆది చేసే స్కిట్ లకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ లభిస్తున్నాయి. ఆది కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆది జబర్దస్త్ కు ఎందుకు దూరం అయ్యాడనే విషయంలో పూర్తి క్లారిటీ రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఆది సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.

హైపర్ ఆదికి యాక్సిడెంట్ అంటూ
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ హైపర్ ఆది గురించి చేస్తున్న ప్రచారం చూస్తే షాక్ కి గురి కావలసిందే. హైపర్ ఆదికి ఘోరమైన యాక్సిడెంట్.. నాగబాబు దిగ్బ్రాంతి అని శీర్షికలు పెడుతూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారంపై ఆది తాజాగా స్పందించాడు.

చెత్త అంటూ ఘాటుగా
ఓ సెల్ఫీ వీడియో ద్వారా తనపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చాడు. కొన్ని చెత్త యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం నాకు ఎదో జరిగిపోయినట్లు అసత్య ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వార్తలని ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఉన్నాను అని ఆది క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆది అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజకీయ కార్యక్రమాలు
ఆది ఓ వైపు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే రాజకీయ కార్యక్రమాలతో కూడా బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ఆది ఎక్కువగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తన రాజకీయ ప్రసంగాల్లో కూడా పంచ్ డైలాగ్స్ తో ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు.


Click it and Unblock the Notifications











