Hyper Aadi: పెళ్లి అప్పుడే చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదునైన పంచులు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించే ఈ కమెడియన్, జబర్దస్త్ వేదికపై తనదైన శైలితో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. బుల్లితెర నుంచి వెండితెర వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆది వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే, తాజాగా యాంకర్ వర్ష హోస్టింగ్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, కుటుంబం, పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

కిస్సిక్ టాక్ షోలో మొదట ప్రేమ గురించి మాట్లాడిన హైపర్ ఆది, తన స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పుడు ఉన్న ప్రేమలు ఏంటో నాకు అర్థం కాదు. మా రోజుల్లో ప్రేమ అంటే చూపుల్లోనే ఉండేది. ఒక అమ్మాయి మనల్ని చూస్తుందా లేదా అని చూసుకోవడం, మరుసటి రోజు ఇంకో చోట కూడా అదే అమ్మాయి మనవైపే చూస్తుందా అని కన్ఫామ్ చేసుకోవడం... అంతే. మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. అది చాలా స్వచ్ఛమైన ప్రేమ' అంటూ చెప్పారు.

Jabardasth Star Hyper Aadi Gives Clear Statement on Marriage in Kissik Talk Show

ఇక వర్ష, 'ఇంట్లో ఒక అబ్బాయి ఉంటేనే అల్లరి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మీ ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది?' అని ప్రశ్నించగా, హైపర్ ఆది నవ్వుతూ స్పందించారు. 'మేము ముగ్గురు అన్నదమ్ములం. మామూలుగా కొట్టుకోవడం కాదు... బెడ్ మీద కూర్చొని 'ఎవరైనా పడతారా?' అని సరదాగా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. ముగ్గురు అన్నదమ్ముల ఎనర్జీ వేరే లెవల్. ఆ ఇంటికి ఉండే బలం కూడా వేరే'అంటూ చెప్పారు. అయితే ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం వల్ల తన తల్లికి ఓ లోటు ఉండేదని, ఆ లోటును పెదనాన్న కుమార్తె తీర్చిందని, ఆమెనే తమ అక్కగా భావిస్తామని చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు.

అనంతరం వర్ష, 'ఆది గారింటికి ఆడపిల్ల ఎప్పుడు వస్తారు?'అంటూ పెళ్లి గురించి ప్రశ్నించగా, ఆయన చాలా సీరియస్‌గా స్పందించారు. 'ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు చూస్తే పెళ్లి గురించి భయం వేస్తోంది. పెళ్లి అనేది చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తాను భావించే ఐడియల్ భర్త లక్షణాలను కూడా హైపర్ ఆది వివరించారు. 'కోపాన్ని కంట్రోల్ చేసుకునే వాడు, ఓపికగా ఉండేవాడు, బయట టెన్షన్లను ఇంట్లోకి తీసుకురాని వాడు, డబ్బుల విషయంలో అత్తమామలపై ఆధారపడని వాడు, తానే సంపాదించుకునే వాడు, అమ్మానాన్నలను వదిలి నీతో జీవించడానికి వచ్చిన అమ్మాయికి తల్లిదండ్రుల ప్రేమ ఇచ్చే వాడు, భార్య ఏం చేసినా భరించే వ్యక్తి మాత్రమే పెళ్లి చేసుకోవాలి'అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

'ఇలాంటి క్వాలిటీస్ అన్నీ నీకున్నాయే?' అని వర్ష అడగగా, 'అంత బాధ్యత తీసుకోగలిగినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి' అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, గతంలో పెళ్లికి ఎంత విలువ ఉండేదో, ఇప్పుడు ఆ విలువ ఎలా తగ్గిపోయిందో కూడా హైపర్ ఆది వ్యాఖ్యానించారు. 'ముందు చేసుకున్న వ్యక్తితోనే జీవితాంతం ఉండాలనే భావన ఉండేది. కానీ, ఈ జనరేషన్‌లో పెళ్లికి విలువ తగ్గిపోయింది. కొందరికి తాళి కట్టితే అది మన మాట విన్నట్టే ఉండాలి అన్న భావన. మరికొందరు 'నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే ఎవ్వరైనా సరే చూస్తాం' అనే స్థాయికి వెళ్లిపోయారు. అందుకే చీటింగ్, విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు'అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X