శ్రీదేవి డ్రామాలో జగనన్న జగనన్న పెరేడి ట్రెండింగ్? YS జగన్, రోజాపై హైపర్ ఆది మాస్ ర్యాగింగ్!

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు కిరాక్ ఆర్పీ. తన స్కిట్స్‌లో పంచ్ డైలాగ్స్, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆర్పీ కొన్ని సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకున్నారు. సినిమాలు, షోలలో చేస్తూనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట తన జిల్లాకు చెందిన ఫేమస్ నాన్ వెజ్ వంటకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెల్లూరు ెద్దారెడ్డి చేపల పులుసు ఔట్‌లెట్లను తెరిచారు. రుచి, క్వాలిటీ బాగుండటంతో వీటికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది.

తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉండే కిరాక్ ఆర్పీ.. 2024 ఏపీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ , జనసేన, బీజేపీకి కూటమికి మద్ధతు పలికారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు ఆర్పీ. ఫలితాలు విడుదలైన నాటి నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్న కిరాక్ ఆర్పీ.. మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ చేసిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

jabardasth hyper aadi performs satirical skit on ys jagan and rk roja

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరించిన విషయాలను కిరాక్ ఆర్పీ బయటపెట్టారు. అర్ధరాత్రుళ్లు తన ఇంటి డోర్లు కొట్టేవారని, తన వెనుక కత్తులతో ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయని కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారానికి కూడా ఇబ్బందులు కలిగించేలా.. తనకు వచ్చిన ఫ్రాంచైజీలను అడ్డుకున్నారని , రేపు అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటే ఇవాళే వారిని ఆపేసేవారని ఆర్పీ ఆరోపించారు. ఇదే సమయంలో అల్లు అర్జున్‌పై ఆర్పీ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ .. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఔట్‌లెట్లపై దాడులు సైతం చేశారు. అయినప్పటికీ కిరాక్ ఆర్పీ మాత్రం తన విమర్శలు ఆపడం లేదు. రోజుకొక ప్రెస్ మీట్ పెట్టడం.. కూటమి నేతలపై ఆరోపణలు చేస్తున్న వారికి కౌంటర్లు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు.

ముఖ్యంగా రోజాను టార్గెట్ చేస్తూ ఆర్పీ చేసే ఫన్నీ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. రోజా రూ.3000 కోట్లు దోచుకుందని.. ఆమె అవినీతిని బయటపెడతానని ఆది ఆరోపించారు. అయితే ఒక రోజు అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను, ''జగనన్న ... జగన్న'' నీకు సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించగా ముఖ్యమంత్రి ఆమె వైపు తిరిగి ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉంటారు. దీనిని బేస్ చేసుకుంటూ ప్రెస్‌మీట్‌లో చెలరేగిపోతున్నారు ఆర్పీ. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో టిక్‌టాక్ స్టార్లు, యూట్యూబర్లు, మీమ్స్ క్రియేటర్లు ఆర్పీ ఎక్స్‌ప్రెషన్స్‌ను వాడేస్తున్నారు.

అలాంటి వాడకంలో మన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ ఇష్యూస్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎలిమెంట్స్ ఆధారంగా తన స్కిట్‌లు రూపొందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో పొట్టి నరేష్‌తో కలిసి ఓ స్కిట్ చేశాడు ఆది. '' శ్రీదేవి డ్రామా కంపెనీలో నా గురించి ఏమనుకుంటున్నార్రా అని ఆది అడుగుతాడు. నీ గురించా అంటూ నరేష్ బదులిస్తూ.. ఆది అన్నా, ఆది అన్నా అందరూ మెచ్చుకుంటున్నారన్నా అని రోజాను కిరాక్ ఆర్పీ వెక్కిరంచిన విధంగా ఆన్సర్ ఇస్తాడు. ఆ మాట చెప్పగానే ఆది, నరేష్ సహా వేదికపై ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూటమి కేడర్ ఈ వీడియోను బాగా షేర్లు చేస్తుంటే.. వైసీపీ జనాలు మాత్రం భగ్గుమంటున్నారు. ఆర్పీలా డైరెక్ట్‌గా కాకుండా ఆది రోజా, జగన్‌లపై నవ్వుతూ సెటైర్లు వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X