twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆది కోసం వెతుకుతున్న ఆ హీరో అభిమానులు.. ఎట్టకేలకు నోరు విప్పిన ఆది.. జరిగింది ఇదేనంటూ వీడియో రిలీజ్

    |

    జబర్దస్త్ కమెడియన్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చిన కొద్ది రోజుల్లోనే జబర్దస్త్ మొత్తం మీద మంచి పేరు తెచ్చుకున్న ఆది అదే విధంగా వివాదాల్లో కూడా ముందు వరుసలో ఉంటాడు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉన్న విషయాలను ఆధారంగా చేసుకుని జోక్స్ పేల్చే అది వివాదాల్లో కూడా ట్రెండింగ్ లోనే ఉంటాడు. తాజాగా దీపావళి ఈవెంట్ లో ఆయన వేసిన జోకులకు గాను పెద్ద దుమారమే రేగింది. ఆయన మీద దాడి జరిగినట్లు వస్తున్న వార్తల మీద ఎట్టకేలకు ఆది నోరు విప్పాడు. వివరాల్లోకి వెళితే

    అలా ఎంట్రీ

    అలా ఎంట్రీ

    సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఆది నటన మీద ఆసక్తితో చేసిన ఒక షార్ట్ ఫిలిం అదిరే అభి కంట పడటంతో ఒక సారి తన వచ్చి కలవాల్సిందిగా కోరాడు. అదే ఆది లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఆది వెళ్లి అదిరే అభి ని కలవడం అభి తన టీం లో జాయిన్ అవమని కోరడం వెంట వెంటనే జరిగిపోయాయి. అదిరే అభి టీం లో జాయిన్ అయిన ఆది కొద్దిరోజులకే తనదైన పంచులతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కొద్ది కాలానికే టీం లీడర్ స్థాయికి ఎదిగిన ఆది తర్వాత కూడా తనదైన పంచ్ పవర్ చూపిస్తూ అందరికంటే ముందు నిలుస్తూనే ఉంటాడు.

    ట్రెండింగ్ జోక్స్ తో

    ట్రెండింగ్ జోక్స్ తో

    అయితే ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెడీ చేసే ఆది అలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ట్రోలింగ్ కూడా భారీగా ఎదుర్కొనాల్సి వచ్చింది. రీసెంట్‌గా ఓ స్కిట్ చేసిన ఆయన మీద దాడి జరిగిందని కొందరు, లేదు బయటకు వస్తే దాడి చేయడానికి చూస్తున్నారు, అందుకే రెండు మూడు రోజులుగా ఆది కనపడడం లేదు అంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ఇష్యూపై ఎట్టకేలకు నోరు విప్పాడు హైపర్ ఆది.

    దీపావళి స్కిట్ లో

    దీపావళి స్కిట్ లో

    అసలు ఏం జరిగింది అంటే, రీసెంట్‌గా జరిగిన దీపావళి స్పెషల్ ప్రోగ్రాంలో హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ కలిసి స్కిట్ చేశారు. అందులో ఒక హీరోను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసారు. ఆయన ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉండడంతో ఆది ఆయనను ఎంచుకున్నాడు. అయితే సదరు హీరో అభిమానులు హైపర్ ఆదిని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరితే, దానికి హైప‌ర్ ఆది నిరాక‌రించ‌డంతో ఆయ‌న‌పై దాడి చేశారంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

    ఎట్టకేలకు నోరు విప్పాడు

    ఎట్టకేలకు నోరు విప్పాడు

    ఆదిని బాగా కొట్టారని, ఈ దాడితో ఆది ఇక సెట్ అవుతాడు అంటూ రక రకాలుగా వార్తల ప్రచారం నడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై హైపర్ ఆది స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఏకంగా వీడియో బైట్ తో అందరి ముందుకొచ్చి తనపై దాడి జరిగిందని వస్తున్న వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. గత రెండు రోజుల నుంచి నెట్టింట్లో ఫేక్ న్యూస్‌ చక్కర్లు కొడుతున్నాయనీ ఆయన అన్నారు.

    Recommended Video

    Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
    మా శాంతి స్వరూప్ కి అప్పగిస్తా

    మా శాంతి స్వరూప్ కి అప్పగిస్తా

    నా కోసం ఎవరో వెతుకుతున్నారట.. నా మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో నిజం లేదు. అరే నాన్న.. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ఎందుకు రాస్తార్రా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి. నేను సంపాదించేదాంట్లో కొంత ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అసలు ఇలాంటి వార్తలు రాసేవాడికి మా శాంతి స్వరూప్‌ను అప్పగిస్తాను అని కూడా వీడియోలో చెప్పుకొచ్చాడు ఆది.

    English summary
    jabardasth hyper aadi responds to rumours about him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X