Hyper Aadi: నాకు అతనికి గొడవలు, తెలియని మ్యాటర్ చెప్పేసిన హైపర్ ఆది.. ఇక నుంచి అయినా!

జబర్దస్త్ కమెడియన్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. స్పెషల్ ఈవెంట్ లు, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే హైపర్ అది అంటే తెలియని బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఉండరు. చాలా కాలంగా అతడు తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు. పంచులు, ప్రాసల స్పెషలిస్టుగా పేరొందిన ఈ యంగ్ టాలెంటెడ్ అనేక షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆదికి మరో కమెడియన్ తో గొడవలు ఉన్నాయని షాకింగ్ విషయాన్ని బయట పెట్టేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కామెడీలో తనదైన మార్క్..

కామెడీలో తనదైన మార్క్..

సినిమా స్ఫూఫ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఆది జబర్ధస్త్‌ షోలోకి రైటర్‌గా ప్రవేశించాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా అంటే కమెడియన్ గా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. తను కనిపించిన స్కిట్లలో తన మార్క్ చాటాడు. ఇలా అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనిలోని టాలెంట్ చూసి హైపర్ ఆదికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు.

సినిమాల్లో ఆర్టిస్టుగా..

సినిమాల్లో ఆర్టిస్టుగా..

ఇలా హైపర్ ఆది కెరీర్ బుల్లితెరపై జబర్ధస్త్‌గా సాగుతోంది. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' మూవీతో డైలాగ్ రైటర్‌గానూ మారాడు. జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించాడు హైపర్ ఆది.

స్టోరీ పరంగా వచ్చే కామెడీతో..

స్టోరీ పరంగా వచ్చే కామెడీతో..

ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ ఇటీవల నటించిన ధమాకా చిత్రానికి కొన్ని కామెడీ సీన్స్ కూడా రాశాడు హైపర్ ఆది. ధమాకా మూవీ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన, హైపర్ ఆది మంచి ఫ్రెండ్స్. ఇదివరకు త్రినాథ రావు సినిమాలకు రచయిత ప్రసన్న కుమార్ రాసేవారు. ఈ ధమాకా చిత్రానికి మాత్రం హైపర్ ఆదిని తీసుకున్నారు. స్టోరీ పరంగా వచ్చే కామెడీతో తనదైన మార్క్ చూపించాడు హైపర్ ఆది.

హీరోయిన్ తండ్రికి డ్రైవర్ గా..

హీరోయిన్ తండ్రికి డ్రైవర్ గా..

ధమాకా చిత్రంలో కామెడీ స్కిట్స్ రైటర్ గానే కాకుండా హైపర్ ఆది ఓ రోల్ కూడా ప్లే చేశాడు. హీరోయిన్ తండ్రి రావు రమేష్ కు డ్రైవర్ గా తనదైన పంచ్ లతో సినిమాలో నవ్వించాడు హైపర్ ఆది. ఇక హైపర్ ఆదికి సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. మీమ్స్ రూపంలోనూ, తన కామెడీ స్కిట్స్ ప్రోమోల రూపంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే తనకు మరో కమెడియన్ సద్దాం హుస్సేన్ కు మనస్పర్థలు వచ్చినట్లు హైపర్ ఆది బయటపెట్టి షాక్ ఇచ్చాడు.

న్యూ ఇయర్ కి స్పెషల్ ప్రోగ్రామ్..

న్యూ ఇయర్ కి స్పెషల్ ప్రోగ్రామ్..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ పేరుతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఇందులో బుల్లితెర కమెడియన్స్ తోపాటు పలు టీవీ సీరియల్స్ నటీనటులు కూడా పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన రెండో ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నరేష్, హైపర్ ఆది, అటో రామ్ ప్రసాద్ తమదైన కామెడీ నవ్వులు పూయించారు. సీరియల్స్ యాక్టర్స్ డ్యాన్స్ పర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు.

ఈ ఏడాది పోవాలి..

ప్రోమో చివర్లో.. 2022లో నాకు సద్దాం హుస్సేన్ గాడికి చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. అవి ఈ 2023 సంవత్సరంలో పూర్తిగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని హైపర్ ఆది చెబుతూ కేక్ ను సద్దాం హుస్సేన్ కు తినిపించాడు. తర్వాత హైపర్ ఆదికి సద్దాం కేక్ తినిపించాడు. అయితే వాళ్లిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టి హైపర్ ఆది షాక్ ఇచ్చాడు. అసలు ఏమైందో తెలియాలంటే డిసెంబర్ 31న రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే క్యాష్ వేర్ ఈజ్ ద పార్టీ ప్రోగ్రామ్ ను చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X