For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hyper Aadi: సీక్రెట్ గా హైపర్ ఆది పెళ్లి?, ఫొటోలు వైరల్.. షాక్ లో అభిమానులు

  |

  హైపర్ ఆది.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా కాలంగా అతడు తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ టాప్ కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు. పంచులు, ప్రాసల స్పెషలిస్టుగా పేరొందిన ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్.. చాలా షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఇక బుల్లితెరపై మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లలో సుడిగాలి సుధీర్ తర్వాత హైపర్ ఆది కూడా ఒకరు. ఇప్పటికీ హైపర్ ఆది పెళ్లి, ఎంగేజమ్ మెంట్ అంటూ వార్తలు తెగ వచ్చాయి. ఈసారి అయితే ఏకంగా హైపర్ ఆది పెళ్లి ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

  ఆర్టిస్టుగా మారి..

  ఆర్టిస్టుగా మారి..

  సినిమా స్ఫూఫ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఆది జబర్ధస్త్‌ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా అతడి కెరీర్ జబర్ధస్త్‌గా సాగుతోంది. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

  డైలాగ్ రైటర్ గా..

  డైలాగ్ రైటర్ గా..

  బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' మూవీతో డైలాగ్ రైటర్‌గానూ మారాడు. జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించాడు హైపర్ ఆది. జబర్దస్త్ మాత్రమే కాకుండా 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరింత హైలైట్ అవుతున్నాడు.

  డ్యాన్స్ షోలో మెంటర్ గా..

  డ్యాన్స్ షోలో మెంటర్ గా..

  సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ 14: డాన్సింగ్ ఐకాన్' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, రష్మీ వెళ్లిపోయిన తర్వాత పడిపోయిన ఈ షోను.. ఆది తన కామెడీతో విజయవంతం చేయాలని ట్రై చేస్తున్నాడు.

  చక్కర్లు కొడుతున్న పెళ్లి ఫొటోలు..

  చక్కర్లు కొడుతున్న పెళ్లి ఫొటోలు..

  ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ ఆదికి విపరీతమైన క్రేజ్ ఉంది. మీమ్స్ రూపంలోనూ, తన కామెడీ స్కిట్స్ ప్రోమోల రూపంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. అయితే ఈసారి నెటిజన్లకు, హైపర్ ఆది అభిమానులకు నెట్టింట్లో షాక్ తగిలింది. ఎందుకంటే సోషల్ మీడియాలో హైపర్ ఆది పెళ్లి ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన ఆది ఫ్యాన్స్, నెటిజన్స్ అతనికి పెళ్లి ఎప్పుడు అయిందని ఆరా తీస్తున్నారు.

   పెళ్లి కొడుకుగా ఆది..

  పెళ్లి కొడుకుగా ఆది..

  హైపర్ ఆది నిజంగానే పెళ్లి చేసుకున్నాడా.. లేదా అనేది తేల్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అసలు నిజం బయటపడింది. ఓ సినిమా సన్నివేశంలో భాగంగా హైపర్ ఆది పెళ్లి కొడుకుగా తయారయ్యాడు. అతనిపై పెళ్లి సీన్ చిత్రీకరించారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఆదికి సీక్రెట్ గా వివాహం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే హైపర్ ఆదితోపాటు ఉన్న ఆ పెళ్లి కూతురు సీరియల్ నటి అని సమాచారం.

  English summary
  Jabardasth Comedian Hyper Aadi Get Married Secretly And His Wedding Photos Are Goes Viral In Social Media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X