జబర్ధస్త్ కమెడియన్లపై వర్ష ఎఫెక్ట్: ఇమాన్యూయేల్ కోవిడ్ టెస్ట్ రిపోర్టు లీక్.. అందులో ఏముందంటే!
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దారుణంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎంతో వేగంగా ప్రభలుతోంది. దీంతో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు బుల్లితెర నటీనటులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో జబర్ధస్త్ బ్యూటీ వర్ష కూడా ఒకరు. రెండు రోజుల క్రితమే ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో వర్ష స్నేహితుడు ఇమాన్యూయేల్ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకున్నాడు. అందులో ఏ రిపోర్టు వచ్చిందంటే!

వర్ష కెరీర్ అలా.. ఇమాన్యూయేల్‌ది ఇలా
నటి అవ్వాలన్న కోరికతో మోడలింగ్ రంగంలోకి అడుగులు వేసింది వర్ష. అలా కొన్నేళ్ల పాటు కెరీర్‌ను సాగించిన ఆమె.. దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే పలు చానెళ్లో ప్రసారం అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించి మెప్పించిందీ తెలుగు బ్యూటీ. 'పటాస్' షో ద్వారా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు ఇమాన్యూయేల్.

ఇద్దరూ అలా కలిశారు.. అదరగొడుతూనే
జబర్ధస్త్‌లోని టాప్ కమెడియన్ అయిన హైపర్ ఆది టీమ్‌లో ఆర్టిస్టుగా వర్ష ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే మెప్పించిన ఆమె.. ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీమ్‌లో కూడా పని చేసింది. ఈ క్రమంలోనే కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. అదే టీమ్‌లో ఇమాన్యూయేల్ సెకెండ్ లీడ్‌గా చేస్తున్నాడు. దీంతో స్కిట్లు చేసే సమయంలో వీళ్లిద్దరికీ కనెక్షన్ కుదిరిపోయింది.

ఇద్దరి మధ్యా ప్రేమాయణం... రొమాన్స్‌తో
జబర్ధస్త్‌లో లేడీ కంటెస్టెంట్‌గా వెలుగొందుతోన్న వర్ష.. ఆ షోలోని టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. కొంత కాలంగా వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్టులు చేస్తుండడమే. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతోంది.

జబర్ధస్త్ వర్షకు కరోనా పాజిటివ్ వచ్చింది
జబర్ధస్త్‌తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ అనే షోలోనూ సందడి చేస్తోంది వర్ష. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలింది. ఇక, ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆమె చేసే షోలలో కలకలం రేగింది.

ఇమాన్యూయేల్‌కు వర్ష గురించి ప్రశ్నలు
సోషల్ మీడియాలో ఇమాన్యూయేల్ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అతడు తరచూ ఏదో ఒక పోస్టుతో నెటిజన్లను అలరిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఇందులో అతడి గురించి పలు రకాల సందేహాలు అడిగిన నెటిజన్లు.. వర్ష గురించి కూడా అతడిని ప్రశ్నించారు.

టెస్టు చేయించుకో.. వర్షకు పాజిటివ్ అట
జబర్ధస్త్ వర్షకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆమె చేస్తున్న షోలలోని సభ్యుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. దీంతో ఆ షోతో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీలోని ఆర్టిస్టులందరి గురించి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో ఓ నెటిజన్ 'టెస్టు చేయించుకో.. వర్షకు పాజిటివ్ అట' అంటూ ఇమాన్యూయేల్‌కు మెసేజ్ పెట్టాడు.
Recommended Video

ఇమాన్యూయేల్ కోవిడ్ టెస్ట్ రిపోర్టు లీక్
నెటిజన్ కోవిడ్ టెస్టు చేయించుకోమని కోరిన వెంటనే ఇమాన్యూయేల్ అతడికి తన రిపోర్టును షేర్ చేసి సమాధానం ఇచ్చాడు. ఇందులో అతడికి నెగెటివ్ అని వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇమాన్యూయేల్‌తో పాటు వర్షతో పని చేస్తున్న ఆర్టిస్టులందరూ టెస్టులు చేయించుకున్నారట. వాళ్లంతా సురక్షితంగానే ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











