ఇమాన్యూయేల్‌కు నెటిజన్ అడగకూడని ప్రశ్న: ఆమెపై ఇష్టాన్ని లీక్ చేసి.. మొబైల్ సీక్రెట్స్ బట్టబయలు

జబర్ధస్త్ షో కొన్ని వందల మందిని బుల్లితెరపైకి తీసుకొచ్చింది. అందులో చాలా మంది గుర్తింపు దక్కక కెరీర్‌లను ముగించేయగా.. కొందరు మాత్రమే ఎనలేని క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అందులో టాలెంటెడ్ కమెడియన్ చాక్లెట్ బాయ్ ఇమాన్యూయేల్ ఒకడు. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేయగలిగే ఈ కుర్రాడు.. వర్షతో లవ్ ట్రాక్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. అదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడికి వింత అనుభవం ఎదురైంది. అదే సమయంలో ఓ సీక్రెట్ లీక్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే...

అలా మొదలైన కెరీర్.. ఇలా వచ్చాడు

అలా మొదలైన కెరీర్.. ఇలా వచ్చాడు

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు టాలెంటెడ్ ఆర్టిస్టు ఇమాన్యూయేల్. ఆ షోలో అద్భుతమైన టాలెంట్‌తో ఇరగదీసిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టాడు. మొదట్లో సాదాసీదా ఆర్టిస్టుగా ఉన్నప్పటికీ.. క్రమంగా తన కామెడీతో మెప్పించాడు. ఫలితంగా సెకెండ్ లీడ్‌గా ఎదిగిపోయాడు.

చాక్లెట్ బాయ్ ఇమాన్యూయేల్ ఫేమస్

చాక్లెట్ బాయ్ ఇమాన్యూయేల్ ఫేమస్

ఇమాన్యూయేల్ రోజు రోజుకూ ఎంతో పరిణితితో పంచులు పేలుస్తూ ఫేమస్ అయిపోయాడు. అలాగే, జడ్జ్ రోజా అతడికి చాక్లెట్ బాయ్ అనే పేరు పెట్టడంతో మరింత పాపులర్ అయ్యాడు. అన్నింటికీ మించి వరుస ఆఫర్లు దక్కించుకోవడంతో పలు షోలలో భాగం అవుతున్నాడు. స్పెషల్ ఈవెంట్లలో సైతం అతడికి ప్రత్యేకమైన రోల్స్ ఇస్తుండడంతో సెలెబ్రిటీగా మారిపోయాడు.

ఆమెతో ప్రేమాయణం.. హగ్గులు, కిస్సు

ఆమెతో ప్రేమాయణం.. హగ్గులు, కిస్సు

జబర్ధస్త్‌లో లేడీ కంటెస్టెంట్‌గా వెలుగొందుతోన్న వర్షతో టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌ ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. కొంత కాలంగా వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్టులు చేస్తుండడమే. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో పాపులర్ అయిపోతోంది.

అందులో యమ యాక్టివ్.. సెషన్‌లతో

అందులో యమ యాక్టివ్.. సెషన్‌లతో

వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఇమాన్యూయేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే సెల్ఫీ వీడియోలు చేస్తుంటాడు. అదే సమయంలో తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫాలోవర్లలో ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించాడీ కమెడియన్.

ఇమాన్యూయేల్‌కు అడగకూడని ప్రశ్న

ఇమాన్యూయేల్‌కు అడగకూడని ప్రశ్న

ఇమాన్యూయేల్ తాజాగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ ఫన్నీగా సాగింది. ఇందులో చాలా మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అతడు తనదైన శైలిలో జవాబులు ఇచ్చాడు. అదే సమయంలో ఎన్నో కొత్త కొత్త విషయాలను వాళ్లతో పంచుకున్నాడు. కొన్ని రహస్యాలను లీక్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అతడిని అడగకూడని ప్రశ్న అడగడం షాకిచ్చింది.

ఏదైనా టిప్ ఉండే చెప్పు బ్రదర్ అంటూ

ఏదైనా టిప్ ఉండే చెప్పు బ్రదర్ అంటూ

ఈ సెషన్‌లో కొందరు నెటిజన్లు ఇమాన్యూయేల్ రంగు గురించి బ్యాడ్ కామెంట్స్ చేశారు. 'కలర్ ఫొటో 2' సినిమా చేయ్ అని ఒకరు అంటే.. ఈ గ్లామర్ సీక్రెట్ ఏంటి అంటూ మరికొందరు అతడిని ఆట పట్టించారు. అయినా వాళ్లకు హుందాగానే బదులిచ్చాడు. ఆ తర్వాత ఓ నెటిజన్ 'జుట్టు ఊడిపోతోంది. టిప్ ఇవ్వు' అని అడగగా.. 'ఏది అడగకూడదో అదే అడిగావు' అంటూ ఇమ్మూ రిప్లై ఇచ్చాడు.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
ఆమెతో ఉన్న బంధాన్ని వివరిస్తూ అలా

ఆమెతో ఉన్న బంధాన్ని వివరిస్తూ అలా

ఇదే సెషన్‌లో జబర్ధస్త్ జడ్జ్‌ రోజాపై తన ఇష్టాన్ని బయట పెట్టుకున్నాడు ఇమాన్యూయేల్. తన ఫోన్ వాల్‌పేపర్‌తో పాటు వాట్సాప్ డీపీగా ఆమె ఫోటోనే పెట్టుకున్నానని స్క్రీన్ షాట్లతో సహా బయట పెట్టాడు. అదే సమయంలో ఓ నెటిజన్ 'మీకు రోజా మేడమ్ అంటే ఎందుకంత ఇష్టం' అని ప్రశ్నించగా.. బండ్ల గణేష్ ఫొటో షేర్ చేసి 'మై నేమ్ ఈజ్ ఇమాన్యూయేల్. మై గాడ్ ఈజ్.. నాకంటే మీకే బాగా తెలుసు' అనే ఆన్సర్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X