చివరకు ఈ స్థాయికి దిగజారారన్న మాట.. ఆ జబర్దస్త్ కమెడియన్స్ పరిస్థితి మరీ దారుణం!!
జబర్దస్త్ వేదికపై నుంచి ఎంతో మంది ఎదిగారు. బుల్లితెరపై స్టార్ స్టేటస్ పొంది.. వెండితెరపైనా మెరిసిన వారున్నారు. వెండితెరపై దుమ్ములేపిన వారు జబర్దస్త్ ద్వారా బుల్లితెరను షేక్ చేసిన వారూ ఉన్నారు. ధన్ రాజ్, వేణు, రోలర్ రఘు, అభి వంటి వారు వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చిన వారే. ఇక హైపర్ ఆది, సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, మహేష్ వంటి వారు బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా నిరూపించేందుకు పాట్లు పడుతున్నారు.

జబర్దస్త్‌లో అలా..
జబర్దస్త్ షోలో జరిగి వాటిపై రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. కంటెస్టెంట్లు స్కిట్స్ చేస్తూ ఉంటే జడ్జ్‌లు అసలు పట్టించుకోరని, వారి పనేదో వారు చూస్తారని, డైరెక్టర్లు నవ్వమని చెప్పినప్పుడు మాత్రమే నవ్వుతారని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అయితే కొందరి స్కిట్స్ వస్తుంటే చూడకుండానే జడ్జ్‌లు అప్పటికే వెళ్లిపోయి ఉంటారట.

ఎడిటింగ్‌లో అలా..
అయితే షూటింగ్‌లో స్కిట్స్ చేసినా ఎడిటింగ్‌లో ఎగిరిపోయే స్కిట్స్ ఎన్నో ఉంటాయట. వీరు కష్టపడి చేసిన స్కిట్స్‌లోనూ ఎన్నో కోతలు ఉంటాయట. ఇక కొందరి స్కిట్స్ మొత్తానికే లేపేస్తారట. అందులో ఆ మధ్య వెంకీ మంకీ టీం స్కిట్స్ కూడా అలానే పోయాయట. ఇదే విషయాన్ని వారు కూడా తమ స్కిట్స్‌లో సెటైరికల్‌గా వాడుతుంటారు.

తాజాగా అలా..
గత కొన్ని రోజులుగా తాగుబోతు రమేష్ జబర్దస్త్ వేదికపై తనను తాను నిరూపించుకునేందుక పడరాని పాట్లు పడుతున్నాడు. ఆయనతో పాటు ఎన్నో యేళ్ల నుంచి ఉంటోన్న జీవన్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ప్రతీ స్కిట్‌లో జీవన్‌ను ఎరుపు అంటూ ఆట పట్టించడం, పిచ్చోడిని చేయడం జరుగుతూనే ఉంది. ఇక టీం లీడర్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు.

తమపై తామే సెటైర్స్..
తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో జీవన్, తాగుబోతు రమేష్ వేసుకున్న సెటైర్స్ బాగానే పేలాయి. దొంగలు పడుతున్నాడని సీసీ కెమెరా పెట్టించాడట..దొంగలు పడి సీసీ కెమెరాలు కూడా పట్టుకెళ్లాడు.. ఎందుకురా అని అడిగితే.. వాడి పుటేజ్ వాడే డిలీట్ చేసుకుంటాడేమో అని జీవన్ అంటాడు. అలాంటి ఆప్షన్ జబర్దస్త్‌లో ఉంటేనా? అంటూ తాగుబోతు రమేష్ తన స్కిట్స్ తానే సెటైర్ వేసుకున్నాడు.
Recommended Video

స్కిట్స్‌పై పంచ్‌లు..
ఇక ఇంట్లోకి ఓ దొంగ రావడంతో.. ‘ఏం కావాలిరా నీకు' అని తాగుబోతు రమేష్ ఆ దొంగను అడగడంతో ఆ టీవీ కావాలని అడుగుతాడు.. ‘సరే తీసుకపోరా' అని తాగుబోతు రమేష్ చెప్పగా.. ‘అందులో జబర్దస్త్ వస్తది' అని జీవన్ అంటాడు. ‘అరేయ్ ఆగురా' అని దొంగను రమేష్ ఆపుతాడు.. వెంటనే జీవన్ అందుకుని ‘అందులో మన స్కిట్ వస్తది' అని మరో కౌంటర్ వేస్తాడు. ‘అరె అర్జెంట్‌గా పీకి తీసుకుపోరా' అని తాగుబోతు రమేష్ ఆ దొంగకు చెబుతాడు. స్కిట్స్‌ను జనాలు మెచ్చడం లేదని తెలుసుకోవడంతో ఇలా తమ స్కిట్స్ మీద తామే పంచ్‌లు వేసుకుంటున్నారు. మొత్తానికి తమ స్కిట్స్ పై తామే సెటైర్స్ వేసుకునే పరిస్థితికి దిగజారారన్న మాట.


Click it and Unblock the Notifications











