Jabardasth: జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ రీ ఎంట్రీ.. స్టేజ్ ముద్దాడుతూ ఎమోషనల్

Photo Courtesy: Mallemalatv

తెలుగునాట పాపులర్ కామెడీ షోగా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది జబర్దస్త్. దాదాపు 12 ఏళ్లుగా ఈ కార్యక్రమం తెలుగు ప్రజలకు వినోదాన్ని అందిస్తూనే ఉంది. ఇటీవల జబర్దస్త్ 12 ఏళ్ల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు హాజరయ్యారు. ఎంతోమంది ప్రతిభావంతులను జబర్దస్త్ కార్యక్రమం ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక్కడ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నవారు సినీ రంగంలో అవకాశాలు అందుకున్నారు. నటులుగా, కమెడియన్లుగా, దర్శకులుగానూ జబర్దస్త్ నటీనటులు వెండితెరపై తమదైన ముద్ర వేశారు.

జబర్దస్త్‌లోకి మాజీలు రీ ఎంట్రీ
అయితే జబర్దస్త్ నుంచి పలువురు నటీనటులు, న్యాయనిర్ణేతలు, యాంకర్లు అనివార్య కారణాలతో తప్పుకున్నారు. వీరిలో నాగబాబుతో పాటు స్టార్ యాంకర్ అనసూయ, సౌమ్యారావు నడిగ్, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, గెటప్ శ్రీను తదితరులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ మాజీ కమెడియన్ తిరిగి జబర్దస్త్ వేదికపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ప్రోమోలో దీనిపై జబర్దస్త్ టీమ్ హింట్ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

Jabardasth Jigel Jeevan and Sattipandu Re Entry into the top comedy show

Photo Courtesy: Mallemalatv

వర్షపై బుల్లెట్ భాస్కర్ సెటైర్లు
ప్రోమోలో యాదమ్మ రాజు- వర్షల స్కిట్ కలర్ ఫుల్‌గా సాగినట్లుగా తెలుస్తోంది. అసలు ప్రేమించినవాళ్లు హ్యాపీగా ఉంటారా? పెళ్లి చేసుకున్న వాళ్లు హ్యాపీగా ఉంటారా? అని వర్ష అడుతుంది. ఇద్దరూ హ్యాపీగా ఉండరు.. లవ్‌లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుతలేవ్.. మాట్లాడుతలేవ్ అని సచ్చిపోతారు. పెళ్లయిన తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అని కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నాకొక కోరిక ఉంది.. హీరోయిన్‌గా అవ్వాలని అనుకుంటున్నాను రాజు అని చెబుతుంది వర్ష. దాంతో బుల్లెట్ భాస్కర్ కాళ్లు పట్టుకుని నా పిల్లని హీరోయిన్‌ని చేయమంటాడు రాజు. దాంతో అది హీరోయిన్ మెటీరియల్ కాదు.. ఎలా ఉందో చూడు ఛార్మినార్ సెంటర్‌లో పిన్నిసులు అమ్ముకునేదానిలా ఉంది అనడంతో అంతా నవ్వేస్తారు.

నువ్వు హీరోవా అంటూ ఫైమా పంచ్‌లు
ఆ తర్వాత వర్ష పొట్టి బట్టల్లో వర్ష ఎంట్రీ ఇస్తుంది. వర్షకు భాస్కర్ సీన్ వివరిస్తుండగా యాదమ్మ రాజు అతనిని పక్కకు నెట్టేసి ఏం చెప్పాలన్నా నాతో చెబితే నాకు చెబుతానని అంటాడు. ఇంతలో ఫైమా వచ్చి నువ్వు హీరోవా? తుమ్ హారా నామ్ క్యా హై అంటూ ముఖంపైనే అడుగుతుంది. చాలా రోజుల తర్వాత హీరోయిన్ ఇండియా వచ్చింది వచ్చిన ఆనందంలో ఓ సాంగ్ చేయమనగా.. పెద్ది సినిమాలో చరణ్ వేసిన స్టెప్స్ వేసి అలరిస్తుంది ఫైమా.

స్టేజ్‌ను ముద్దాడుతూ ఎమోషనల్
ఆ తర్వాత జబర్దస్త్‌ను వీడిన సత్తిపండు, జీగేల్ జీవన్, మరో కమెడియన్లు రీ ఎంట్రీ ఇచ్చినట్లు యాంకర్ రష్మి గౌతమ్ చెబుతుంది. తిరిగి రావడం ఎలా అనిపిస్తోందని జీవన్‌ను అడగ్గా.. చాలా హ్యాపీగా ఉంది, ఇన్ని రోజులు అన్నం పెట్టిన స్టేజ్ ఇది. దూరమయ్యేసరికి ఏదో దూరమైనంత బాధ అనిపించిందని చెప్పి స్టేజ్‌ను ముద్దాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత సత్తిపండు మాట్లాడుతూ.. జబర్దస్త్‌లోకి రావడం వల్ల అమోఘమైన పాపులారిటీ దక్కిందని చెప్పాడు. మరో కమెడియన్ మాట్లాడుతూ.. జబర్దస్త్ వదిలేసినా సరే ఆ జబర్దస్త్ మమ్మల్ని ఇంకా బ్రతికిస్తది. మేం చచ్చేదాకా జబర్దస్త్ అన్న పేరు మీదే బతుకుతాం.. ఇదైతే నిజం అని చెప్పడంతో అంతా క్లాప్స్ కొడతారు. ఇక ప్రోమో చివరిలో దొరబాబు డ్యాన్స్ ఇరగదీయడంతో యాంకర్లు రష్మి, మానస్‌లతో పాటు అందరూ వన్స్‌మోర్ అంటారు. మరి జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కమెడియన్లు నిజంగానే తిరిగొచ్చేశారా? లేక గెస్ట్ అప్పీయరెన్స్ మాత్రమేనా? అన్నది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: jabardasth rashmi gautam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X