జబర్ధస్త్ షోలో కలకలం: ఆ కమెడియన్‌ను కొట్టబోయిన జడ్జ్.. అవమానం జరిగిందంటూ అందరి ముందే!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారం అవుతోన్న ఏకైక కామెడీ షో జబర్ధస్త్. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లుగా టెలివిజన్‌ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ కార్యక్రమం.. అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన ప్రేక్షకాదరణను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం అందుకుంటోంది. దీంతో కొన్ని రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటోందీ సక్సెస్‌ఫుల్ షో. ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో జబర్ధస్త్ ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో ఓ టీమ్ లీడర్‌పై జడ్జ్ చేయి చేసుకోబోయారు. ఆ వివరాలు మీకోసం!

 జబర్ధస్త్ వల్ల వాళ్లంతా ఫుల్ పాపులర్

జబర్ధస్త్ వల్ల వాళ్లంతా ఫుల్ పాపులర్

తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా వెలుగొందుతున్నారు. అలాగే, కొన్ని వందల మందికి ఈ షో ద్వారా జీవనోపాధి లభిస్తోంది. అందుకే ఇది మంచి పేరును సంపాదించింది.

 వాళ్లకు మాత్రం బాగా ప్లస్ అయింది

వాళ్లకు మాత్రం బాగా ప్లస్ అయింది

తెలుగులోనే నెంబర్ వన్ కామెడీ షో అయిన జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. వీళ్లిద్దరి నవ్వులు, స్కిట్ల మధ్యలో వేసే పంచులు బాగా పేలేవి. అందుకే ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

ఆ బ్యూటీలకు కూడా భారీగా గుర్తింపు

ఆ బ్యూటీలకు కూడా భారీగా గుర్తింపు

జబర్ధస్త్ వల్ల ఆర్టిస్టులు, జడ్జ్‌లు మాత్రమే కాదు.. ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌కు కూడా ఈ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందనే చెప్పాలి. ఇందులోకి రాకముందు పెద్దగా పరిచయం కాని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.. దీని పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన గుర్తింపును అందుకున్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు.

ఆయన అదుర్స్ అనిపించేలా చేస్తూ

ఆయన అదుర్స్ అనిపించేలా చేస్తూ

జబర్ధస్త్ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోయిన తర్వాత చాలా మంది ఆయన స్థానంలోకి వచ్చారు. అయితే, వాళ్లంతా పెద్దగా మెప్పించకపోగా మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేమస్ సింగర్ మనో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఆయన కూడా అద్భుతమైన పంచులతో అలరిస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ స్కిట్లు కూడా చేస్తూ సత్తా చాటుతున్నారు.

అదిరేలా జబర్ధస్త్.. చాలా మార్పులు

అదిరేలా జబర్ధస్త్.. చాలా మార్పులు

జబర్ధస్త్ షోలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. కామెడీ డోసును పెంచేందుకు టీమ్ లీడర్లు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త స్కిట్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో షో నిర్వహకులు కూడా కొన్ని హంగులను జోడిస్తూ ప్రేక్షకులకు మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే కొన్ని టీమ్‌లలో మార్పులు చేర్పులు కూడా చేసేశారు.

ఆ కమెడియన్‌ను కొట్టబోయిన జడ్జ్

ఆ కమెడియన్‌ను కొట్టబోయిన జడ్జ్

వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఆరంభం నుంచే అదిరిపోయే పంచులను చూపించారు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీమ్, బుల్లెట్ భాస్కర్‌ స్కిట్లను హైలైట్ చేశారు. ఇక, చివర్లో జడ్జ్ మనో కోపంతో ఊగిపోవడం కనిపించింది. ఆయన రాకింగ్ రాకేష్‌ను కొట్టేందుకు ప్రయత్నించారు.

అవమానం జరిగిందంటూ ముందే

అవమానం జరిగిందంటూ ముందే

జడ్జ్ సీటులో ఉన్న సింగర్ మనో 'రాకేష్ మీరంటే నాకు గౌరవం ఉంది. కానీ ఇలా చేస్తారా? ఏం స్టేజ్ ఇది ఏం చేస్తున్నారు' అంటూ సీరియస్ అయ్యారు. అప్పుడు రాకేష్ సారీ చెప్పే ప్రయత్నం చేసినా.. రోజా ఆపినా ఆగకుండా ఆయన దిగి వెళ్లిపోయారు. ఒకానొక దశలో రాకేష్‌ను కొట్టబోయారు. ఇదంతా ప్రోమో చివర్లో చూపించి వచ్చే ఎపిసోడ్‌పై అంచనాలు పెంచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X