స్వీయ గృహ నిర్బంధంలో రోజా.. కరోనా టెన్షన్‌లో జబర్దస్త్ టీమ్

సినీ రంగంతోపాటు రాజకీయ రంగంలో దూసుకెళ్తున్న ఫైర్ బ్రాండ్ యాక్టర్, పొలిటిషియన్ రోజా సెల్వమణి బుల్లితెరపైన కూడా బ్రహ్మండంగ రాణిస్తున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌కు రోజా న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత ఈ కామెడీ షో ఎపిసోడ్స్‌ను నిరంతరంగా షూట్ చేశారు. ఈ క్రమంలో రోజా గన్‌మెన్‌కు కరోనా సోకడంతో ఇప్పుడు జబర్దస్త్ టీమ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక జబర్దస్త్ టీమ్ పరిస్థితి ఏలా ఉందంటే..

కరోనా పరిస్థితులను లెక్క చేయకుండా

కరోనా పరిస్థితులను లెక్క చేయకుండా

నగరి ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలోనూ బిజీ బిజీగా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చోరవ చూపుతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ప్రజలతో మమేకం అవుతున్నారు. అలాగే జబర్దస్త్‌ కామెడీ షోలో పాల్గొంటూ కొత్త ఎపిసోడ్స్‌ షూట్‌లో భాగమయ్యారు.

వచ్చేవారం ఎపిసోడ్స్ కోసం

వచ్చేవారం ఎపిసోడ్స్ కోసం

గత వారం రోజులుగా జబర్దస్త్ ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఆ క్రమంలో మంచి జోష్‌తో వచ్చే వారానికి సరిపోయే విధంగా కొన్ని ఎపిసోడ్స్‌ను రెగ్యులర్‌గా షూట్ చేశారు. ఆ క్రమంలోనే ఇలాంటి రోజా షెడ్యూల్ బిజీ బిజీగా ఉన్న సమయంలో ఆమె బాడీగార్డుకు కరోనా పాజిటివ్ అని తేలింది.

కరోనా టెస్ట్ ఫలితాల కోసం

కరోనా టెస్ట్ ఫలితాల కోసం


దాంతో రోజా కూడా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. తాను చేయించుకొన్న పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దాంతో ఆమె ఫలితాల కోసం వేచి చూడకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో ఉండిపోయారు. ఎవరికీ అందుబాటులో లేకుండా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. కరోనా టెస్ట్ రిపోర్టుల కోసం రోజా ఎదురుచూస్తూ ముందు జాగ్రత్త చర్యగా ఇతరులకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది.

జబర్దస్త్ టీమ్‌లో టెన్షన్

జబర్దస్త్ టీమ్‌లో టెన్షన్


రోజా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారనే విషయంతో జబర్దస్త్‌లో పాల్గొన్న మరో న్యాయమూర్తి మనో, యాంకర్ అనసూయ భరధ్వాజ్, ఇతర కమెడియన్లు తమ పరిస్థితి ఏమిటనే విషయంపై కంగారు పడుతున్నారట. రోజా కరోనా టెస్ట్ ఫలితాలు ఎలా వస్తాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ప్రస్తుతం ఓ రకమైన భయంతో వారు ఉన్నట్టు తెలుస్తున్నది.

సరికొత్త గేమ్ షోతో రోజా

సరికొత్త గేమ్ షోతో రోజా

ఇక జబర్దస్త్ కామెడీ షోతోపాటు మరో రియాలిటీ షోను రోజా ప్లాన్ చేశారు. అమ్మ.. సరిలేరు నీకెవ్వరు అనే గేమ్ షోను ప్రారంభించాలని అనుకొన్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ గేమ్ షో ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. త్వరలోనే ఈ షోను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X