నటుడిగా మారుతున్న సింగర్ మనో.. జబర్దస్త్ జోష్‌తో బుల్లితెరపై కొత్త అవతారం

ప్రఖ్యాత సింగర్ మనో విభిన్నమైన వ్యాపకాలతో దశాబ్దానికిపైగా దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ హోస్ట్‌గా, కామెడీ షోలకు న్యాయమూర్తిగా తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే సింగర్ మనో మరో సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. జీ తెలుగు ఆ కొత్త బాధ్యతను భుజానికి ఎత్తుకొన్నది.

జీ తెలుగు టెలివిజన్ ఛానెల్ కల్యాణం కమనీయం అనే డైలీ సీరియల్‌ను ప్రారంభించడానికి సిద్దంగా ఉంది. ఈ సీరియల్ ద్వారా మనో నటుడిగా ఓ విభిన్నమైన పాత్రను పోషించడానికి సిద్దమవుతున్నారు. ఈ సీరియల్‌లో హరిత, మేఘన లోకేష్, తదితరులు కీలక పాత్రలను పోషించనున్నారు. ఈ సీరియల్‌లో మనో గోవర్దన్ అనే పాత్రను పోషిస్తున్నారు. సీతారత్నంగా హరిత, చైత్రగా మేఘన లోకేష్, విరాజ్‌గా మధు నటిస్తారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత హరిత మళ్లీ బుల్లితెరపై కనిపించబోతుండటం గమనార్హం.

Jabardasth judge, Singer Mano turns as Actor for Kalyanam Kamaneeyam serial in Zee Telugu

కల్యాణం కమనీయం సీరియల్ కథా విషయానికి వస్తే.. సీతారత్నం తన కూతుళ్లు చిన్నగా ఉండగానే విడిపోతుంది. తన తండ్రి దీర్ఘకాల వ్యాధితో మంచం పట్టిన సమయంలో తల్లి దూరమైపోయిందనే విషయాన్ని చైత్ర, తన సోదరి తెలుసుకొంటారు. అయితే తన తల్లి గురించి ఏ మాత్రం తెలియని పరిస్థితుల్లో ఇద్దరు కూతుళ్లు వెతుకులాట మొదలుపెడుతారు.

కల్యాణం కమనీయం సీరియల్ జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్నది. ఈ సీరియల్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకొని ఎలాంటి టీఆర్పీని సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇక మనో విషయానికి వస్తే.. గాయకుడిగా రాణిస్తూనే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని షోలలో ప్రత్యేక అతిథిగా మెరుస్తున్నారు. తాజాగా నటుడిగా మారుతున్న మనో మరింత ఆకట్టుకోవాలని అభిమానుల కోరుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X